29.7 C
Hyderabad
April 29, 2024 07: 29 AM
Slider ప్రత్యేకం

తమిళనాడులో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

తమిళనాడులోని 45 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈరోజు ఏకకాలంలో దాడులు చేసింది. అక్టోబర్ 23న కోయంబత్తూర్‌లో దీపావళి సందర్భంగా ఆలయం వెలుపల జరిగిన కారు బాంబు పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ ఈ చర్య తీసుకున్నది. కారు బాంబు పేలుడులో ‘మానవ బాంబు’ జమీషా ముబిన్ (29) మరణించింది. కేంద్ర హోం త్రిత్వ శాఖ ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించింది. కారులో ఉన్న ఎల్‌పీజీ సిలిండర్‌ పేలిన కారణంగా ఈ ఘటన రిగింది.

అయితే ఘటనా స్థలం నుంచి గోళీలు, మందుగుండు సామాగ్రి తునకలు లభ్యమయ్యాయి. సిలిండర్‌లో వాటిని నింపి పెద్ద కుట్ర పన్నారని, అయితే అది విఫలమైందని పోలీసులు పేర్కొన్నారు. అక్టోబర్ 23న తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించింది. తమిళనాడు పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ అధికారులు గురువారం 45 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. కొత్తమేడు, పొన్విజా నగర్, రతిన్‌పురి, ఉక్కడం వంటి ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలకు బంధించి అనుమానితుల నివాస ప్రాంగణంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసిన 15 రోజుల తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ చర్య తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)కి చెందిన కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్ (సీటీసీఆర్) విభాగం ఈ అంశంపై దర్యాప్తు జరపాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు సిఫార్సు చేసిన మరుసటి రోజే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. కోయంబత్తూరులోని ఉకడం ప్రాంతంలో కారు సిలిండర్‌ పేలుడు ఘటనకు సంబంధించిన కేసు ర్యాప్తును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని సీఎం స్టాలిన్‌ హోంశాఖకు సిఫార్సు చేశారు. దీంతో పాటు కోయంబత్తూరులో భద్రత కల్పించాలని తమిళనాడు పోలీసులను ఆదేశించారు. ఈ పేలుడు కేసులో తమిళనాడు పోలీసులు ఇప్పటి వరకు అరడజను మందికి పైగా అరెస్టు చేశారు. వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) ప్రయోగించారు.

అరెస్టయిన వారు పేలుడులో మరణించిన జమీషా ముబీన్ సహచరులు. అరెస్టయిన నిందితుల్లో మహ్మద్ తాల్కా (25), మహ్మద్ అస్రుద్దీన్ (25), మహ్మద్ రియాజ్ (27), ఫిరోజ్ ఇస్మాయిల్ (27), మహ్మద్ నవాజ్ ఇస్మాయిల్ (27), మృతుడి బంధువు అఫ్సర్ ఖాన్ ఉన్నారు. తమిళనాడు పోలీసులు జరిపిన దాడిలో ముబిన్ ఇంట్లో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో 75 కిలోల పొటాషియం నైట్రేట్, బొగ్గు, అల్యూమినియం పౌడర్, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాన్ని పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముబిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఉగ్రవాద సంబంధాలపై 2019లో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు.

Related posts

అనుమానంతో వ్యక్తిపై కాల్పులు

Bhavani

మోడీ విధానాలు త్రిప్పి కొట్టెందుకే….27 భారత్ బంద్….!

Satyam NEWS

ఆయన లేనిదే అక్కడ ఎవ్వరూ జాతీయ జెండా ఎగురవేయలేరు..!

Satyam NEWS

Leave a Comment