Slider ఆదిలాబాద్

రైతులకు ఇబ్బందిగా ఉన్న లాక్ డౌన్ సమయం

Nirmal BJP

కరోనా లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో రైతులు పండించిన కూరగాయలు, ఉత్పత్తి చేసిన పాలను నిర్మల్ పట్టణానికి తీసుకురాలేకపోతున్నారని నిర్మల్ జిల్లా బీజేపి నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నేడు నిర్మల్ కలెక్టర్ ను కలిసిన బిజెపి నాయకులు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. నిర్మల్ జిల్లాలో ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకే నిబంధనలు సడలిస్తున్నారని అందువల్ల రైతులు రాలేకపోతున్నారని వారన్నారు.

అందువల్ల రైతుల కోసం నిబంధనలను సడలించాలని వారు కోరారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో కేంద్ర ప్రభుత్వ విత్తన సంస్థ పాలక మండలి సభ్యుడు అయ్యన్న గారి భూమయ్య, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభుడు ఒడిసెల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆడెపు సుధాకర్, టౌన్ బిజెపి అధ్యక్షడు అయ్యన్న గారి రాజేందర్ తదితరులు ఉన్నారు.

Related posts

డివిజన్ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి

Satyam NEWS

భారత నిఘా క్వాడ్ కాప్టర్ ను కూల్చిన పాకిస్తాన్

Satyam NEWS

మారుమూల ప్రాంతాల్లో పర్యటించిన ఆసిఫాబాద్ ఎస్పీ

Satyam NEWS

Leave a Comment