42.2 C
Hyderabad
April 26, 2024 15: 21 PM
Slider ఆదిలాబాద్

మూడు సూత్రాలు పాటించి కరోనాను నివారించండి

#Nirmal SP

నిర్మల్ పట్టణంలో కరోనా కట్టడికి చేయడానికి జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు నేడు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన స్వయంగా ప్రచారం చేశారు. నిర్మల్ లోని చైన్ గేట్ కూరగాయల మార్కెట్ లో, జామా మసీదు, బుధవార్ పేట్ చౌరస్తా, గాంధీ చౌక్, గుల్జార్ మార్కెట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇంటి వద్దనే ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలన్నారు. తమ తమ ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు బయటికి రావద్దన్నారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కూలు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని ప్రతి ఒక్కరూ ప్రతి పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రజలంతా కరోనా వ్యాధిని పారద్రోలేందుకు తమ వంతు సహకారం అందించాలన్నారు.  

లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని దీన్ని అధిగమించేందుకు కరోనా వైరస్ తో సహజీవనం చేస్తూనే పోరాటం చేయవలసి  ఉందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు.

అవగాహన కార్యక్రమాలలో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని మరియు శానిటైజర్ వాడాలని ఈ మూడు సూత్రాలు పాటించి కరోనాను నివారించాలని సూచించారు.  ఈ సందర్భంగా వైద్య సిబ్బంది థర్మల్ స్కానర్ తో పలువురికి చెక్ చేశారు. మాస్కులు ధరించని వారికి మాస్కులను ఎస్పీ అందించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, DM&HO వసంతరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బి.వెంకటేష్, సి.ఐ.లు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, రవీందర్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అర్ఐలు వెంకటి, కృష్ణాజనేయులు, యంటిఓ వినోద్, ఆర్ఎస్ఐ దేవేందర్, ఎస్.ఐ.లు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రైతుల్ని మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి

Satyam NEWS

బ్రుటల్ యాక్షన్:మహిళను స్తంభానికి కట్టి చెప్పులతో కొట్టారు

Satyam NEWS

వలస దుఃఖం

Satyam NEWS

Leave a Comment