28.7 C
Hyderabad
April 28, 2024 06: 59 AM
Slider పశ్చిమగోదావరి

చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుతుగున్న కామ పిశాచి

#complaint

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఓ జిల్లా ఉన్నతాధికారి సుమారు 6 నెలల నాడు తన కార్యాలయ పరిధిలో జిల్లా లో పలు ప్రాంతాలలో ఉన్న ఉప కార్యాలయాలలో విధులు నిర్వహించే 11 మంది మహిళా ఉద్యోగులపై అత్యాచార యత్నాలకు, లైంగిక వేధింపులు, వికృత చేష్టలకు పాల్పడ్డాడని కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆయన చేష్టలకు సహకరించకపోతే విధుల పరంగా అక్రమాలకు పాల్పడుతున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని రిపోర్ట్ లు రాసి మెమో ఇస్తానని బెదిరించేవాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమను లైంగికంగా బాధించే వాడని 11 మంది మహిళా ఉద్యోగులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో కాలయాపన చేశారని, చివరకు ఆ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లినా బాధిత మహిళలను విచారించడానికి మహిళా శాఖ ఉన్నతాధికాని నియమించాలని అందుకు జిల్లా ఉన్నతాధికారి పర్మిషన్ కావాల్సి ఉందని అప్పట్లో తెలిపారు. అప్పట్లోనే ఆ శాఖ కమిషనర్ ని ఈ ఘటన పై సత్యం న్యూస్ ఫోన్ లో వివరణ కోరగా ఏలూరులో సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణ ఇస్తామని తెలిపారు.

బాధిత మహిళలను అధికారికంగా బతిమిలాడో, భయపెట్టొ ప్రలోభ పెట్టో బుజ్జగించొ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల పై విచారణను కొనసాగనియకుండా ఉన్నత స్థాయిలో పైరవీలు, లాబీలు నడిపి చట్టాలకు దొరకకుండా న్యాయస్థానం గడప తొక్కకుండా పొక్సో, దిశా చట్టాలకు చిక్కకుండా తప్పించుకున్నాడం టే ఆ అధికారి ఆర్థికంగా ఎంత కోటీశ్వరుడోనని ఆ శాఖలో కొంతమంది ఉద్యోగులే అప్పట్లో చెవులు కోరుక్కున్నట్టు తెలిసింది. అధికారికంగా, జకీయంగా ఎంతో పలుకుబడి ఉపయోగించుకుని ఈయన లైంగిక వేధింపుల బారిన పడిన 11 మంది బాధిత మహిళలు అదే శాఖలో ఉన్నతాధికారులకు ఈ అధికారిపై లిఖిత పూర్వక పిర్యాదు పోలీసుల వరకు వెళ్లకుండా

ఆగిందంటే 11 మంది మహిళా ఉద్యోగులపైలైంగిక దాడులకు.అత్యాచార యత్నాలకు పాల్పడినట్టు విధులు నిర్వహించే శాఖలో పై అధికారులకు సిగ్గు విడిచి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా బాధిత మహిళా ఉద్యోగులకు న్యాయం దక్కలేదని పలువురు ఉద్యోగులు చెప్పుకుంటున్నట్టు సమాచారం.

Related posts

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు

Satyam NEWS

జగన్ నిర్వాకం వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రిక్తహస్తం

Satyam NEWS

కరోనాతో శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోమ్‌

Sub Editor

Leave a Comment