38.2 C
Hyderabad
April 27, 2024 15: 45 PM
Slider కృష్ణ

వ్యాధుల నివారణే లక్ష్యంగా మణిపాల్ గుడ్ హెల్త్ రన్

#manipalhospital

మణిపాల్ హాస్పిటల్ నిర్వహించిన 10 & 5 కె పరుగు ప్రారంభ కార్యక్రమంలో విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా జెండా ఊపి పరుగును ప్రారంభించారు. జీవనశైలి మార్పుల ద్వారా వ్యాధుల నివారణే లక్ష్యంగా మణిపాల్  క్లినికల్ వారు ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయవాడ పడవల రేవు సెంటర్ నుండి  మణిపాల్ గుడ్ హెల్త్ రన్ ను 5కి.మీ, 10కి.మీ అనే రెండు కేటగిరిలో  నిర్వహించడం జరిగింది.

ఈ పరుగు లో సుమారు 4,000 వేలకు పైగా నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ నేపధ్యం లో  నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్న ఈ గుడ్ హెల్త్ రన్ నిజంగా అభినందనీయం. రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తున్న వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరుతున్నాను అని అన్నారు. సగటు మానవుని బిజీ లైఫ్ లో వాకింగ్, రన్నింగ్ కు ఉన్న ప్రాముఖ్యను మరిచిపోయారు. కావున సమాజంలో వాటిపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా మరియు ఎమర్జెన్సీ సమయాల్లో మనుషుల ప్రాణాలు ఎలా కాపాడాలి అనే దాని సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కలెక్టర్ ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టా టాతోపాటు, మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి, జీవందన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. కె. రాంబాబు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

అందరికి ఆమోదయోగ్యమైన రీతిలోనే రైలు మార్గం

Bhavani

కరోనా హెల్ప్: తోచిన సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు

Satyam NEWS

విజయనగరం లో రోడ్డెక్కి గళమెత్తిన మీడియా

Satyam NEWS

Leave a Comment