28.7 C
Hyderabad
April 27, 2024 05: 45 AM
Slider ముఖ్యంశాలు

విజయనగరం జనసేన పార్టీ లో  వేరు కుంపట్లు…

#vijayanagaramjanasena

జనసేన….ఏపీలో అందరినోట వినిపిస్తున్న పార్టీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్…. స్థాపించిన పార్టీ ఈ జనసేన. రాష్ట్రంలో అధికార సాధనకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రజా సమస్యలు.. ప్రభుత్వం పరిష్కరించని సుదీర్ఘ మైన సమస్యలపైనే దృష్టి పెడుతున్నారు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్. అందులోంచి మొలకెత్తిందే…”జనవాణి”.

రాష్ట్రమంతటా పర్యటిస్తున్న పవన్ కల్యాణ్… ఈ నెల 15వ తేదీ నుంచీ ఉత్తరాంధ్ర లో పర్యటించనున్నారు..ఇంతవరకు బాగానే ఉంది… ఆ విషయం చెప్పేందుకు… విజయనగరం జిల్లా లో ఆ పార్టీ రెండు వేరు కుంపట్లు తో మీడియా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైఎస్ యశస్వి ,మరో వైపు ఆదాడ మోహన రావు. ఒకరు నాన్ లోకల్…ఇంకొకరు పక్కా లోకల్.

పార్టీ అధినేత ఉత్తరాంధ్ర టూర్ ఉంటుందని…ఇద్దరు నేతలు ఒకేసారి వేరువేరు ప్రదేశాలలో సమావేశం పెట్టడంపైనే అందరి దృష్టి. ఇటీవలే పార్టీ తరుపున నాగబాబు వచ్చి నగరంలో ని ఎస్.వీ.ఎన్ హోటల్ లో నిర్వహించిన సమావేశంలో.. అటు యశస్వి కి గాని ఇటు ఆదాడ మోహన్ రావు గాని ఎటువంటి బాధ్యతలు అప్పజెప్పలేదు కదా…పార్టీ అధికారికంగా ఎవ్వరినీ నియమించలేదని.. చెప్పినట్లు పార్టీ నేతలే చెబుతున్నారు.

ఈ దశలో పార్టీ అధినేత ఉత్తరాంధ్ర పర్యటన విశేషాలను చెప్పేందుకు జనసేన పార్టీ కార్యాలయమైన హిమగిరి-సప్తగిరి ల వద్ద  ఆ పార్టీ అధినేత్రి యశస్వి మీడియా సమావేశం పెట్టిమరీ అధినేత టూర్ విషయాలు చెప్పారు. అదే సమయంలో నగరంలోని కంటోన్మెంట్ గణేష్ కోవెల వద్ద ఉన్న జనసేన పార్టీ ఆఫీసు లో ఆదాడ మోహనరావు మీడియా తో మాట్లాడతారని సమాచారం వచ్చింది.

కానీ అదే సమయంలో ఆయన అకస్మాత్తుగా వైజాగ్ వెళ్లడంతో మరో నేత అని అంటున్న త్యాడ బాలకృష్ణ.. పార్టీ అధినేత పర్యటన వివరాలు చెప్పారు. దీంతో ఒకే పార్టీ లో రెండు వేరు కుంపట్లు ఉన్నాయని.. జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. అసలు పార్టీ అధినేత.. అధికారికంగా ఎవరిని నియమించినట్లు…?ఈ విషయంలో ఒకరిపై ఒకరు… ఆరోపణలు,..ఆక్షేపమణలు చేసుకోవడంతో…ఇంతకీ అసలు నేతలు ఎవ్వరని ప్రశ్నిస్తోంది సత్యం న్యూస్. నెట్.

ఇది లా ఉంటే నిన్న కాక మొన్ననే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు… రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పడంతో… జనసేన పార్టీ సన్పధ్ధం అవ్వబోతున్న వేళ…విజయనగరం జిల్లా లో ఈ వేరు కుంపట్లపై పార్టీ అధీనేత దృష్టి పెట్టకపోతే…. కష్ఠమేనని అంటోంది సత్యం న్యూస్. నెట్.

Related posts

మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కేర్ ఆఫ్ కంచెరపాలెం నిర్మాత ప్రవీణ

Satyam NEWS

ప్రతి నిరుపేదను ఆదుకొని ఆర్ధిక సహాయం అందించాలి

Satyam NEWS

ఇంటింటి ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment