40.2 C
Hyderabad
April 26, 2024 11: 25 AM
Slider నెల్లూరు

సీనియర్ జర్నలిస్ట్ వారణాసి నాగార్జున మృతి

#Nagarjuna

జర్నలిస్ట్ గా ఎవరిని నొప్పించ కుండా, ఎందరికో ఉదారంగా సహాయం అందించి మంచి మనస్సు ఉన్న పేద బ్రాహ్మణుడిగా పేరు పొందిన నెల్లూరు జిల్లా బాలాజీ నగర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ వారణాసి నాగార్జున ఈరోజు ఉదయం శివాక్యం పొందారు. ఆయనకు భార్య ,తల్లి ఉన్నారు. పిల్లలు లేరు.

ఆంధ్ర జ్యోతి, మనం, హెచ్.యం.టి. తదితర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో పని చేసిన ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమాని. గత కొద్దిరోజులు గా ఆయన టైపాయిడ్ జ్వరంతో బాధపడు తున్నట్టు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. తాను అందరి ఆశీస్సులతో కొలుకున్నట్టు కూడా పోస్ట్ చేసారు.

శివ భక్తుడు అయిన తాను ఒక వేళ తాను చనిపోతే సోమవారం చని పోతానని, తన చితి పై అన్న నందమూరి తారకరామారావు పోస్టర్లు వేసి చితి వేయాలని కోరారు. అన్నట్టుగానే టైపాయిడ్ మహమ్మారి రావడం సొంత వైద్యం చేసుకోవవం, ఏమి కాదులే అన్న నిర్లక్ష్యం ఆయన్ను మృత్యువు కబళించింది.

ఆదివారం ఆయన శ్వాస అందక ఇబ్బంది అకాల మృత్యు వాత పడి నారు. అన్నట్టు గానే సోమ వారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి చెందారనే వార్త అందరిని కలిచివేసింది. నిజాయితీ పరునిగా, అందరితో కలుపు గోలుగా ఉండే వారణాసి నాగార్జున ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని రాజంపేట కళంగలం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, నెల్లూరు జిల్లా తెలుగు యువత నేత కర్ణాటకం కొండల్ రావు, పార్టీ శ్రేణులు, నందమూరి వంశాభిమానులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts

సోషల్ మీడియాకు అలవాటు పడొద్దు..!

Satyam NEWS

కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి

Bhavani

ఏప్రిల్‌ నెలలో తిరుమ‌ల‌లో నిర్వహించే విశేష ప‌ర్వ‌దినాలు ఇవే

Satyam NEWS

Leave a Comment