27.7 C
Hyderabad
April 26, 2024 06: 54 AM
Slider విశాఖపట్నం

టెక్వీస్సేన్ సాఫ్ట్వేర్ ప్రారంభించిన మంత్రి అవంతి

minister avanthi 2

విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం ద్వారా ఐటీ రంగంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ గంభీరం ఏపీ ఐ ఐ సి పరిశ్రమల సముదాయంలో  టెక్వీస్సేన్ సాఫ్ట్వేర్ కంపెనీ మంత్రి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది.

విశాఖలో పర్యాటక, ఐ టి , సాంస్కృతిక నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. టెక్వీస్సేన్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధి రాజీవ్ సెంట్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవ దృక్పథంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కంపెనీ ప్రారంభించినట్టు చెప్పారు.

ప్రస్తుతం 300 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని మరో 500 మంది ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త బుచ్చయ్య వైకాపా నాయకులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒంగోలులో శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు మంత్రి హామీ

Satyam NEWS

ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ హెల్మెట్ ధరించాలి

Satyam NEWS

చిన్న‌శేష వాహ‌నంపై గీతా కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Satyam NEWS

Leave a Comment