40.2 C
Hyderabad
April 29, 2024 17: 27 PM
Slider గుంటూరు

రాష్ట్రం లో మైనార్టీలకు రక్షణ లేదు: టిడిపి నాయకులు

#telugudesham

వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ లేదని నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్  సైదావలి, మైనార్టీ టిడిపి సీనియర్ నాయకులు మన్నన్ షరీఫ్, పఠాన్ సలీమ్ ఖాన్, నరసరావుపేట నియోజకవర్గ మైనార్టీ  అధ్యక్షులు షేక్ మాబు, సెక్రెటరీ షేక్ కొమ్మాలపాడు మస్తాన్, పట్టన మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ షరీఫ్, షేక్ సుభాని, ప్రధాన కార్యదర్శి షేక్ ఖలీల్, సయ్యద్ భాష, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్ధన బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ముస్లిం మైనార్టీ కుటుంబానికి చెందిన బాలిక మిస్బా మరణం వెనుక వైసిపి నాయకుల హస్తం ఉందని అమీర్ అలీ ఆరోపించారు.

చక్కగా చదువుకొనే పేదింటి ముస్లిం బాలికను స్కూల్ ప్రిన్సిపాల్ తో సహా  వైసిపి నాయకులు వేధించారని, ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన ఆ బాలిక కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి మూడేళ్ళ ప్రభుత్వంలో రాష్ట్రం లో అనేక చోట్ల ముస్లిం మైనార్టీల పై దాడులు, అత్యాచారాలు  జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క ఛాన్స్ అంటూ ముస్లిం మైనార్టీ ఓట్ల తో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత టిడిపి ప్రభుత్వం లో ఇచ్చిన రంజాన్ తోఫా, విదేశీ విద్య తో పాటు అనేక పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలందరు ఏకమై జగన్ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్ధన బాబు మాట్లాడుతూ వైసిపి పాలనలో  ప్రజా వేదిక, అన్నా క్యాంటిన్ లు కూల్చి వెతలు చూస్తుంటే జగన్ ప్రభుత్వం లో నిర్మాణాలకంటే కూల్చి వెతలే కనబడుతున్నాయన్నారు.

వైసిపి ప్రభుత్వం లో టిడిపి నాయ్యకులు, కార్యకర్తల పై అక్రమ కేసులు పెడుతున్నారన్నారని, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీల పై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రం లో నష్ట పోయిన మిర్చి రైతులకు న్యాయం చేయాలని, వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల దగ్గర కొన్న ధాన్యానికి తక్షణమే ప్రభుత్వం డబ్బులు చెల్లించాలని, పంటలు పండక, గిట్టుబాటు ధర లేక, ఈ సమయంలో శిస్తు నీటి తీరువా వడ్డీ తో సహా బలవంతంగా వసూళ్లు చేయాలని ప్రభుత్వం పూనుకోవటం దారుణమన్నారు.

Related posts

డా. ఈడ్పుగంటి పద్మజా రాణికి తెలంగాణ ప్రభుత్వం సన్మానం

Satyam NEWS

నివాస గృహాల మధ్య వైన్ షాపు: మందు బాబులతో సమస్య

Satyam NEWS

“సేవాదాస్” సంచలనం సృష్టించాలి: ప్రీరిలీజ్ వేడుకలో అతిధులు

Satyam NEWS

Leave a Comment