42.2 C
Hyderabad
April 26, 2024 15: 04 PM
Slider కడప

ఎంత సేపు ఫోన్ కొట్టినా స్పందించని 108..104..

#No Response 108

రోగి ఇబ్బందుల్లో ఉన్నపుడు  స్పందించవలసిన 108,104 అంబులెన్స్ లు రెండున్నర గంటల పాటు బాధితులు ఫోన్ చేసిన స్పందించక పోవడంతో ఆటోలో హాస్పిటల్ కు వెళ్లిన ఘటన రాజంపేట లో జరిగింది. కడప జిల్లా రాజంపేట సాయినగర్ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబం తీవ్ర అనా రోగ్యంతో 108,104 కు ఫోన్ చేయగా సిబ్బంది స్పందించ లేదు.

దీనితో సహాచర రాజంపేట ఆర్టీసి డిపో సిబ్బంది బాధితుని ఆటో లో డ్రైవర్ ససేమిరా అన్నా బ్రతిమ లాడి రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సాయినగర్ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు ఇటీవల జ్వరంతో బాధపడుతున్నాడు. ఉన్నట్టు ఉండి శుక్రవారం సాయంత్రం శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో భార్య పద్మ తో పాటు ఆర్టీసీ సిబ్బంది బి.యం.యం.రాజు సహకారంతో 108 ,104 కు ఫోన్ చేశారు.

సాయంత్రం 6.30 గంటల పైనుంచి పలుమార్లు ఫోన్ చేసినా వారు అదిగో, ఇదిగో నంటూ 108 చేయమని 104 సిబ్బంది, 108 కు చేయమని 104 సిబ్బంది ఫోన్ కట్ చేయడం తో వారు ఆవేదన చెందారు. దాదాపు రెండున్నర గంటల అనంతరం గత్యంతరం లేక బాధితులు ఆటోలో హాస్పిటల్ కు తరలించారు.

దీనిపై 108 పై ఫోన్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి కి ఈ సమస్య తీసుకుపోతామని, మనిషి చావు బ్రతుకుల మధ్య రాని 108,104 ఎందుకని, ఇంత నిర్లక్ష్యమా అని ఫోన్ లో నిలదీశారు. కాగా ఫోన్లో పేరు చెప్పని ఆ ఉద్యోగి తాము దీనిపై విచారణ చేస్తామని చెప్పారు.

అంతా జరిగి పోయాక విచారణ దేనికని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో కొస మెరుపు ఏమిటంటే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 108,104 వాహనాలు ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఖాళీ గా ఉన్నాయి. వారికి సమాచారం రాక పోవడంతో వారు రాలేదని తెలిసింది. ఈ సంఘటన108,104 సిబ్బంది నిర్లక్ష్యం కు పరాకాష్ట గా నిలుస్తోంది.

Related posts

అనవసరంగా బయటకు వస్తున్న  వారిపై కేసు నమోదు

Satyam NEWS

రిబ్బన్ కట్:పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన కలెక్టర్ ఎస్పీ

Satyam NEWS

లేటెస్ట్ పోస్టర్:నాగచైతన్య సాయి పల్లవి ల లవ్ స్టోరీ

Satyam NEWS

Leave a Comment