32.7 C
Hyderabad
April 27, 2024 01: 19 AM
Slider ప్రపంచం

దేవాలయం నిర్మాణంపై పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో వివాదం

#Sheren Mazri

పాకిస్తాన్ లో మైనారిటీలకు రక్షణ కల్పించలేకపోతే భారత్ లో ముస్లింల గురించి ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ముస్లింల గురించి మాట్లాడే హక్కు మనకు ఎలా వస్తుందని మానవహక్కుల మంత్రి షిరీన్ మాజ్రీ ప్రశ్నించారు. ఇస్లామాబాద్ లో హిందూ దేవాలయం నిర్మించే అంశంపై జాతీయ అసెంబ్లీలో తలెత్తిన వివాదంలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో మైనారిటీలకు కల్పించిన హక్కులపై రాజీపడరాదని అన్నారు.

మైనారిటీ హిందువుల దేవాలయం నిర్మించడానికి ప్రభుత్వం సహకరించకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్షపై ప్రశ్నించాలంటే పాకిస్తాన్ లో హిందువులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇస్లామాబాద్ లోని సెక్టార్ హెచ్ 9లో హిందూ దేవాలయం నిర్మించేందుకు అభ్యంతరం లేదని అయితే దానికి నిధులు ఎక్కడ నుంచి తీసుకురావాలనే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నామని మతపరమైన అంశాల మంత్రి నూరుల్ హక్ ఖాద్రీ అన్నారు.

మైనారిటీ నాయకులు తనను కలిశారని, నిర్దేశిత ప్రాంతంలో దేవాలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారని అందుకు ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని కూడా కోరారని అయితే అంత పెద్ద మొత్తంలో దేవాలయం నిర్మించేందుకు తమ వద్ద నిధులు లేవని ఆయన అన్నరు.

ప్రభుత్వ ధనం దేవాలయాల నిర్మాణానికి ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని ప్రధానికి నివేదించామని, అదే విధంగా ఇస్లాం మత పెద్దలకు కూడా పరిస్థితి నివేదించామని వారి నుంచి సమాధానం వచ్చిన తర్వాత హిందూ దేవాలయం నిర్మాణం విషయాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

Related posts

రేపు కొల్లాపూర్ ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం

Satyam NEWS

ప్రేమ పేరుతో పొదలచాటుకు వెళ్లేవారిపై షీ టీమ్స్ నిఘా

Satyam NEWS

పులి దాడిలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రి పరామర్శ

Satyam NEWS

Leave a Comment