27.7 C
Hyderabad
April 26, 2024 06: 31 AM
Slider తూర్పుగోదావరి

అరణ్యంలో ఆక్రందన: డోలినే వారి… జీవన గాడి

#traibals

కాకులు దూరని కారడవి అది. అరణ్యంలో వలస గిరిజనుల రోదన అంత ఇంత కాదు. ఆ అడవిలో ఓ కుగ్రామం ఆ గ్రామ ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి అనుకోకుండా ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఆ విషాదం నుండి బయట పడటానికి ఆ మహిళ వేదన చెప్పలేనంత.

అడవి నుండి బాహ్య ప్రపంచానికి రాగలుగుతానా? బతికి బట్టకట్ట గల్గుతానా అని ఆ తల్లి పడ్డ బాధ ఎవరూ తీర్చలేనిది.  ఎట్టకేలకు గ్రామస్థులు వారి జీవన గాడి అయిన డోలి పై ఆ మహిళను అడవి నుండి బయటకు తీసికెళ్ళారు.

ఎట్టకేలకు గౌరీదేవిపేట వైద్యులు పుల్లయ్య స్పందించి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండల పరిధిలోని రామచంద్రపురం అనే గ్రామంలో సుమారు 30 గిరిజనులు కుటుంబాలు నివసిస్తున్నాయి.

గురువారం ఉదయం ఉరుములు మెరుపురాలతో కుడినా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. సుమారు ఎనిమిది గంటల సమయంలో మడివి.యడమయ్య అనే గిరిజనుడి ఇంటి పై పిడుగు పడి ఇంట్లో ఉన్న అతని భార్య మడివి ఉంగమ్మ (35 సం) ఆమె చీరాకు మంటలు అంటుకొని కాలుతుండంగా గ్రామస్తులు గమనించి ఆ మంటలను ఆర్పారు.

అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై ఆ ఊరి లోకి వాహనాలు వచ్చే రోడ్డు మార్గం లేకపోవడంతో డోలే కట్టుకొని  సుమారు పదిహేను కిలోమీటర్ల మేరకు వాహనాలు తిరిగే రోడ్డు వద్దకు తీసుకువచ్చి మానవత్వం చాటుకుంటున్నారు. ఆ సమాచారం  తెలుసుకున్న ఆ గ్రామ పరిధిలోని  ఆశవర్కర్ పల్లంటి శ్రీలత 108 సిబ్బంది సహకారంతో శాస్త్ర చికిత్స నిమిత్తం గౌరదేపేట పి.హెచ్.సి హాస్పటల్ కి తరలించారు.

ఐదు రోజులు హాస్పిటల్ లో అబ్సెర్వేషన్ లో ఉంచుతామని  ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి ఏమిలేదని గౌరీదేవి పేట పీ.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ పుల్లయ్య తెలిపారు. తమ గ్రామం ఏర్పడి 35 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు రోడ్డు మార్గం లేదని ప్రాణాపాయ స్థితిలో ఏం చేయాలో తెలియడంలేదని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అత్యవసర వాహనాలు రావడానికి రోడ్డు మార్గం  లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామ ప్రజలు అంటున్నారు.

Related posts

యుద్ధంలో 498 మంది రష్యన్ సైనికులు హతం

Satyam NEWS

పెద్ద ఆఫర్ ను వదులుకున్న దిల్ రాజు

Satyam NEWS

అవినాష్ రెడ్డి కి ముందస్తు బెయిల్

Satyam NEWS

Leave a Comment