38.2 C
Hyderabad
April 29, 2024 14: 37 PM
Slider హైదరాబాద్

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోడల్‌ కేంద్రం

#ENTHospitalKoti

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్‌ ఫంగస్‌ సమస్య వస్తోందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వెల్లడించింది. బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్టు తెలిపింది. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు మాత్రం పూర్తిగా కోఠిలోని ఈఎన్‌టీలోనే చికిత్స అందిస్తామని స్పష్టంచేసింది. బ్లాక్‌ ఫంగస్‌కు వాడే ఔషధాలు సమకూర్చాలని ఈ మేరకు టీఎస్‌ఎంఐడీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్‌ స్థాయిని సరిగా అదుపుచేయాలని డీఎంఈ సూచించింది. కరోనాతో చికిత్స పొందుతున్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. షుగర్‌ స్థాయిలను నియంత్రించేందుకు అవసరమైతేనే స్టిరాయిడ్లు వాడాలంది. బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్నవారిలో ఎక్కువగా ఈఎన్‌టీ సమస్యలు వస్తున్నాయి.

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోడల్‌ కేంద్రం

బ్లాక్ ఫంగస్ బారిన పడి కంటి వైద్యుడి అవసరం ఉంటే గనక అలాంటి రోగుల కోసం సరోజినీదేవి కంటి ఆస్పత్రి సేవలు వినియోగించుకోవాలని సూచించింది. గాంధీ ఆస్పత్రి, సరోజినీదేవి ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు పరస్పరం సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

Related posts

కల్వకుర్తిలో ఉగ్రవాదుల శిక్షణ కేంద్రం?

Satyam NEWS

పల్లె ప్రగతి స్పూర్తితోనే పట్టణ ప్రగతి కార్యక్రమం

Satyam NEWS

ఎస్సీ సబ్ ప్లాన్ అమలు గడువును పొడిగించాలి

Satyam NEWS

Leave a Comment