28.7 C
Hyderabad
April 27, 2024 06: 37 AM
Slider ప్రత్యేకం

పిలుపు ఇచ్చినా పెరగని ఓటింగ్ పర్సంటేజి

GHMCPolling

జీహెచ్ఎంసి ఎన్నికలలో పోలింగ్ మందకొడిగానే సాగుతున్నది. ఉ. 7 గం. లకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి రెండు గంటలల్లో పోలింగ్ మందకొడిగానే సాగింది.

ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఓటింగ్‌కు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపడంలేదు. ఇక ఓటుహక్కు వినియోగించుకుంటున్న అధికారులు, ప్రముఖులు మాత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు.

గత రెండు ఎన్నికల్లో పోలింగ్ 50 శాతం మించలేదు. ఐదేళ్ల పాటు నగర భవిష్యత్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ణయించే ఎన్నికలను ఓటర్లు లైట్ తీసుకుంటున్నారు.

ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. సాధారణ ఎన్నికల్లో కంటే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గత రెండు ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూస్తే, ఓటర్ల నిరాసక్తత ఏంటో తెలుస్తుంది. 2009లో 42.92 శాతం ఓటింగ్ జరిగింది. 2016లో అది కేవలం మూడు శాతం పెరిగింది.

గత ఎన్నికల్లో 45.27 శాతం మాత్రమే ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికైనా హైదరాబాదీలు కదిలి, కనీసం 50 శాతానికి పైగానైనా ఓటు హక్కు వినియోగించుకుంటారేమో చూడాలి.

Related posts

విశాఖ శారద పీఠంలో ముగిసిన యాగం

Satyam NEWS

వినుకొండ రోడ్ లో మాతాశ్రీ హాస్పిటల్ ప్రారంభం

Satyam NEWS

ప్రకృతి వైద్యంలో కొత్త పుంతలు తొక్కే శాంతిగిరి

Satyam NEWS

Leave a Comment