Slider సినిమా

దర్శక హీరో వినాయక్ చిత్రం ప్రారంభం

vinayak

ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి నిన్ననే సీనయ్య అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను దసరా పండుగ సందర్భంగా నిన్న విడుదల చేశారు. వినాయక్ పుట్టినరోజు కావడంతో నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. భారీ తమిళ చిత్రాల దర్శకుడు శంకర్‌ శిష్యుడు ఎన్‌. నరసింహారావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ‘దిల్‌’ రాజు నిర్మాణంలో రూపొందుతోంది. 1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్‌ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఈచిత్రంపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

Related posts

ఏపీఎంలపై వేటు వేయడం సిగ్గుమాలిన చర్య: కాటిపల్లి

Satyam NEWS

బిచ్కుంద‌లో మిన్నంటిన‌ బీజేపీ సంబురాలు

Sub Editor

కమలానికి కలిసి వచ్చే కాలం ఇది కాదు

Satyam NEWS

Leave a Comment