35.2 C
Hyderabad
May 1, 2024 01: 21 AM
Slider ఆంధ్రప్రదేశ్

పోలీసుల వైఫల్యంతో ఫైరింగ్ వరకూ వచ్చిన పరిస్థితి

chandrababu go back

చంద్రబాబునాయుడి భద్రతకు బాధ్యత వహిస్తున్న ఎన్ ఎస్ జి కమెండోల బృందం తీవ్ర చర్యలకు పాల్పడేందుకు అనుమతి తీసుకున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. విశాఖపట్నంలో నిన్న చంద్రబాబునాయుడి కారుపై రాళ్లు చెప్పుల దాడి జరిగిన విషయం తెలిసిందే.

విశాఖ పోలీసులు అక్కడ గుమికూడిన ప్రజలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని అందువల్ల తాము ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఎన్ ఎస్ జి సెక్యూరిటీ సిబ్బంది తమ హెడ్ క్వార్టర్స్ కు సమాచారం పంపినట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో వెంటనే స్పందించిన కేంద్ర హోమ్ శాఖ, రాష్ట్ర డీజీపీ కి ఫోన్ చేసింది. చంద్రబాబు భద్రతపై అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలు అందడంతో ఎన్ ఎస్ జి కమెండోలు తదుపరి చర్యలకు దిగినట్లుగా తెలిసింది.

అయితే చంద్రబాబునాయుడు ముందుకు వెళ్లకుండా వెనక్కు తగ్గి విమానాశ్రయంలోనికి వెళ్లేందుకు నిర్ణయించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఎన్ ఎస్ జి కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Related posts

హ‌త్య‌కు నిర‌స‌గా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని టీడీపీ ఆందోళ‌న‌

Sub Editor

టీడీపీ అధినేత అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ కాగడాల ర్యాలీ

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికలకు రూ.1.84 కోట్లు విడుదల

Murali Krishna

Leave a Comment