Slider కడప

రాజంపేటలో బత్యాల ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి

#TDP

అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజి ముఖ్యమంత్రి వర్యులు, నవరస నటరత్న నటసార్వభౌమ స్వర్గీయ ఎన్.టి.రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులతో కలిసి కడపజిల్లా రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు గల NTR విగ్రహానికి పాలాభిషేకం, గజమాలలు వేసి ఘణనివాళులర్పించారు.

అలాగే ఉదయం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి నిరుపేదలైన వారందరికీ భోజనం పెట్టారు.ఈ కార్యక్రమంలో బత్యాల మాట్లాడుతూ స్వర్గీయ ఎన్.టి.రామారావు సామాన్యుల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్న మహానుభావుడని,రాష్ట్ర బడ్జెట్ 2960 కోట్లు ఉన్నపుడు 2/- కేజీ బియ్యానికి 97 కోట్లు డబ్బులు ఇచ్చి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి నటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని,ఆయన 1982 మార్చి 27వ తేదీ నాడు తెలుగుదేశం పార్టీని పెట్టీ 1983 జనవరి 09వ తేదీ నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినటునవంటి ఘనత స్వర్గీయ ఎన్.టి.రామారావు గారికే దక్కుతుందన్నారు.కేవలం తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని మొదటి సంతకం సామాన్యులకు కూడు దక్కే

విధంగా మనిషికి 6 కేజీల చొప్పున బియ్యం అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని, రైతులకు అందుబాటులో ఉండేవిధంగా జల వనరులు సేకరించడం,తమిళ నాడుకు నీళ్లు ఇచ్చేవిధంగా తెలుగుగంగ ప్రాజెక్టును ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ గారిని, యంజి రాంచంద్రన్ ను మన కడపకు తీసుకువచ్చి ప్రారంభించారని తెలిపారు.ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రజలకు చేసినటువంటి సేవ రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక రోజు కూడా సరిపోదని అన్నారు.ఆనాడు సంగ విధ్రోహులైన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి 50వ పెత్తన దారి వ్యవస్థను కతం చేసి సామాన్యులకు అధికారం ఇచ్చినటు వంటి ఘనత ఎన్.టి.రామారావు గారికే దక్కుతుందని,

చేనేత కార్మికులు దగ్గర జనతా బట్టలు కొని 50 శాతానికి సామాన్యులకు బట్టలు ఇచ్చారని, మహిళలకు సమాన ఆస్థి హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోవడానికి కావాలసిన రక్తం కోసం గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసి సామాన్యులకు కూడా బ్లడ్ అందుబాటులో ఉండి ప్రాణాన్ని బతికించుకోవడనికి ఉపయోగపడేలా ఒక బృహత్తర

కార్యక్రమాన్ని నిర్వహించారని బత్యాల గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, వీరబల్లి, టి.సుండుపల్లి మండలాలలో ఘనంగా నిర్వహించారు.నందలూరు, ఒంటిమిట్ట లో జరిగిన కార్యక్రమంలో మండలంలోని టీడీపి నేతలతో కలసి బత్యాల పాల్గొని పార్టీ జెండాను ఎగురవేసి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి, కాయ కర్పూరం సమర్పించి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒంటిమిట్టలో ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న పేషెంట్లకు, స్టాఫ్ కు పండ్లును అందజేశారు. ఆయా మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు,ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో 20 మంది పోలీసులకు కరోనా

Satyam NEWS

ఎటాక్: కాకినాడలో మహిళా జర్నలిస్టుపై దాడి

Satyam NEWS

సీఎం సొంత నియోజకవర్గంలో త్రాగు నీటి కోసం అలమటిస్తున్న ప్రజలు

Bhavani

Leave a Comment