38.2 C
Hyderabad
April 29, 2024 11: 12 AM
Slider ఖమ్మం

అక్టోబర్ 21న ఫ్లాగ్ డే

#cp

అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే)పురస్కారించుకొని  అక్టోబర్ 21 నుండి 31 వ తేదీ వరకు కమిషనరేట్ పరిధిలో పలు సామాజిక సేవ, పోలీసు విధుల గురించిన అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఖమ్మం  పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా వందలాది పోలీసులు  ప్రాణాలు అర్పిస్తున్నారని, అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్ధాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ పోటీలతో పాటు వ్యాసరచన , రక్తదానం, ఒపెన్ హౌస్,సైకిల్ ర్యాలీ, గ్రామాలు,కాలనీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  పోటీలు, కార్యక్రమాలలో విద్యార్థులతో పాటుగా యువత, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అక్టోబర్‌ 21 న ఫ్లాగ్ డే సందర్భంగా పరేడ్ పోలీస్ స్మారక స్ధూపం వద్ద అమరవీరులకు నివాళులు,  అక్టోబర్‌ 22 న పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు, అక్టోబర్‌ 24 న రక్తదాన శిభిరం, అక్టోబర్‌ 26 న సైకిల్ ర్యాలీ, అక్టోబర్‌ 27 న పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు, అక్టోబర్‌ 27, 28 న ప్రజలకు అవగాహన కోసం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, కాలనీలో పోలీస్ సిబ్బంది సందర్శన,  అక్టోబర్‌ 28 న ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

Related posts

కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి

Satyam NEWS

‘‘జగనన్న క్యాంటిన్’’ అని పేరు పెట్టుకుని అన్న క్యాంటిన్లను తెరవండి

Satyam NEWS

కొల్లాపూర్ లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకు కరోనా?

Satyam NEWS

Leave a Comment