38.2 C
Hyderabad
April 29, 2024 11: 53 AM
Slider హైదరాబాద్

అధికారుల నిర్లక్ష్యంతో పోతున్న ప్రాణాలు

#dusarilavanya

అంబర్పేట్ నియోజకవర్గం, గోల్నాక డివిజన్లోని టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గతంలో గోల్నాక చౌరస్తాలో ఒక ప్రాణం పోయింది.  ఇప్పుడు నింబోలి అడ్డాలో ఇది రెండోసారి జరగడం ఇద్దరు చిన్నారులు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలు ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నామని వారి కుటుంబాలు మీ అధికారుల వల్ల రోదిస్తున్నారని కార్పొరేటర్ గోల్నాక డివిజన్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

టౌన్ ప్లానింగ్ అధికారులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని డిప్యూటీ కమిషనర్ కి తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలిపారు. ఈ సమస్యల పైన మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు దృష్టికి, జీహెచ్ఎంసీ కమిషనర్ కి, మేయర్ దృష్టికి తీసుకెళ్తానని అధికారుల నిర్లక్ష్యం, నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు.

మేము ఎన్నిసార్లు చెప్పిన వాళ్ల పద్ధతిలో మార్పులు జరగట్లేదని వారికి బాధ్యత కూడా లేకుండా పోయిందని, ఉన్నామా అంటే ఉన్నాము, అన్నట్టు అధికారుల తీరు…. ఇలాంటి సమస్యలు ఇంకా తలెత్తే ప్రమాదాలు ఉంటాయి. అధికారుల్లో మార్పు లేకపోతే వీళ్ళనైనా మార్చాలని మంత్రిని కలుస్తానని ప్రజలకు తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

సి ఎం జగన్ ఆశయాలకు ప్రతిబింబం కావాలి

Satyam NEWS

విశాఖ డైరీ చైర్మన్ ఆడారి మృతి

Bhavani

వీబీజీ సేవలను విమర్శించడం సిగ్గుచేటు

Satyam NEWS

Leave a Comment