ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేసే స్థాయికి సచివాలయ ఉద్యోగులు రావాలని శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆకాంక్షించారు. స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన నేడు సచివాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున ప్రతి ఒక్కరికి స్వాంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో నూతన పథకాలు అమలు చేస్తున్నామని,విలేజి వాలంటీర్ల రూపంలో రాష్ట్రం నలుమూలలా ప్రజా సేవకులను రిక్రూట్ చేశామని ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సచివాల ఉద్యోగులు మరింత అంకిత భావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే బృహత్ బాధ్యతను సచివాలయ ఉద్యోగులు అంకిత భావంతో తీసుకోవాలని నీరబ్ కుమార్ ప్రసాద్ కోరారు. నీతి, నిజాయితీలతో అంకిత భావంతో పని చేసిన వారిని ప్రభుత్వం గుర్తిస్తుందని ఆయన తెలిపారు. పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసే బాధ్యతను ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాలని ఆయన కోరారు.
previous post