39.2 C
Hyderabad
April 28, 2024 11: 41 AM
Slider పశ్చిమగోదావరి

టెన్త్ పరీక్షాకేంద్రాలను పరిశీలించిన అధికారులు

#pedavegi

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో  పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసిన మూడు పరీక్షా కేంద్రాలను పెదవేగి తహసీల్దార్ ఎన్ నాగరాజు, పెదవేగి  ఎం పి డి ఓ రాజ్ మనోజ్, పెదవేగి ఎస్ ఐ లక్ష్మణ్ పరిశీలించారు. పెదవేగి, విజయరాయి, రాయన్నపాలెం, కూచింపూడి, వంగూరు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను పెదవేగి మండల అధికారులు  సందర్శించారు. పాఠశాలల ఉపాధ్యాయులతో పరీక్షల ఏర్పాట్ల పై అడిగి తెలుసుకున్నారు. 10 వ తరగతి విద్యార్దులందరూ పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులందరు మంచి మార్కులు తెచ్చుకుని పాఠశాలలకు, ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని, పదవ తరగతి ఉత్తీర్ణతలో పెదవేగి మండలాన్ని జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిపి రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలందుకోవాలని కోరుతూ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ అంటూ తహసీల్దార్, ఎం పి డి ఓ.ఎస్ ఐ లు విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మండలం లోని అన్ని పరీక్షా కేంద్రాలలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు పరిక్షరాసే అన్ని గదులలో విద్యార్దుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాట్లను అధికార బృందం పరిశీలించారు.

Related posts

అంతర్ జాతీయ పవర్ లిఫ్టర్ సాఖీబ్ బాషకు ఎంపీ ఆదాల సత్కారం

Satyam NEWS

మహిళా సంఘం భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌ రావు భూమి పూజ

Satyam NEWS

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..!

Satyam NEWS

Leave a Comment