27.7 C
Hyderabad
April 26, 2024 05: 35 AM
Slider రంగారెడ్డి

లేఅవుట్ లో పార్కుల ఉనికి భద్రం క్షేత్ర స్థాయిలో శూన్యం

#MyapurPark

హైదరాబాద్ నగర శివారులోని అత్యంత ముఖ్యమైన అమీన్ పూర్ మున్సిపాలిటీ కథ ఇది. సరిగ్గా చూస్తే ఈ ఒక్క మునిసిపాలిటీనే కాదు రాష్ట్రంలో చాలా ప్రాంతాలు, హైదరాబాద్ లోని ఎన్నో కాలనీల కథ ఇది. పట్టించుకునే నాధుడే లేడు.

హైదరాబాద్ లో చెరువులు, పార్కులు కబ్జాలు అయినందున ఇటీవల వచ్చిన వరదల నష్టం ఎంతో ప్రత్యక్షంగా కనిపించింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నరేంద్ర నగర్ కాలని లేఅవుట్ నక్షా చూస్తే అందులో పార్కు ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఈ లేఅవుట్ డ్రాయింగ్ లో ఒక ప్రవేశం లేక నిష్క్రమణ రోడ్డు కూడా కనపడదు. ఈ లేఅవుట్ ను ఆమోదించిన వారు ఎంత చతురులో లో చెప్ప నక్కర లేదు. ఈ లేఅవుట్ లో నాలుగు రిజర్వుడు పార్క్ స్థలాలు చూపిస్తుంటే 24 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు లేఅవుట్ యజమాని నుండి పార్క్ స్థలాల గిఫ్టు డీడులను స్థానిక సంస్థ అథికారులు  సేకరించటానికి చొరవ తీసికొనలేదు.

అధికారులే స్థలాలు కబళించేస్తే ఎవరితో చెప్పాలి?

అంటే అథికారులు ఎంత ఔదార్యులో అర్థం చేసుకో వచ్చు. 2008లో గ్రామ పంచాయతీ కార్యదర్శి మధుసూదన రెడ్డి, ఇక్కడి పార్కు స్థలాలను దర్శించి వెళ్ళినా, 2009లో ఆయనే ఈ లేఅవట్ పూర్తి పాలనా నిర్వహణ వారి పరిథి లోనికి తీసుకున్నట్లు సర్కులర్ ఇచ్చినా నరేంద్ర నగర్ కాలని గతులు మాత్రం మారలేదు.

అప్పటి నుండి ఇటీవల వరకు ఈ లేఅవుట్ లో గృహ నిర్మాణ సంస్థ వారు అభివృద్ధి పేరుతో అనేక రకములైన రుసుములు కాలని నివాసముల యజమానులు నుండి అథిక మొత్తాలలో వసూళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకొక సంగతి ఈ గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్లే నాలుగు పార్క్ స్థలాలను కబళించేశారు.

అంటే లేఅవుట్ అసలు యజమాని నుండే ఆ స్థలాల రిజిస్ట్రేషన్ లు వారి పేరన వ్రాయించు కున్నారు. అంటే వ్రాత మూలకంగా గాని, భౌతికం గా కాని ఈ స్థలాలు ఇప్పటి వరకు స్థానిక సంస్థ స్వాధీనం లో లేవు. ఆ స్థలాలు కోసం ప్రజలు, అధికారులు వెతుక్కోవాల్సి వస్తున్నది.

ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు లేవు

ఆక్రమణ దారులు మాత్రం యధేచ్ఛ గా ప్రహరీలు నిర్మాణం చేసి మరీ స్థలాలను ఆక్రమించు కుంటున్నారు. కేవలం ఫిర్యాదులు ఆధారంగా నే స్థానిక సంస్థవారు ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈ ఆక్రమణ దారులు అడ్రసు తెలిసినా,వారి పై ఎలాంటి చర్య తీసుకొనటం లేదు.

చట్ట ప్రకారం కనీసం ఆక్రమణలు తొలగింపు ఖర్చులు కూడా ఆక్రమణ దారులు నుండి వసూలు చేయకుండా మొఖమాటం తో వదిలేసి  స్థానిక సంస్థ నిథులను  అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. ఈ ఆక్రమణ దారులు నమిలి మింగేసి వదిలేసిన ఎంగిలి భూమి అన్నట్లు  అర కొర భూమిని చూపిస్తూ ఇదే పప్పన్నం అనుకో, పాయసం అనుకో అన్నట్లు కొద్ది భూమిని పుణ్యానికో, థర్మానికో అనుకోండి అన్నట్లు మొక్కలు నాటుతామని మున్సిపాలిటీ అథికారులు చెపుతారు,చివరకు అదీ చేయరు.

సింపుల్ గా ఆక్రమణల నిరోధక హెచ్చరిక సైన్ బోర్డులను ఆక్రమణలను తొలగించిన స్థలాల్లో స్థాపన చేయించి చేతులు శుభ్రం చేసుకుంటారు. మళ్ళా తిరిగి  ఆ ఆక్రమణ పాత కథలే వినిపిస్తుంటాయి. కనీసం స్థానిక సంస్థ ఆ పార్కు స్థలాలను భౌతిక స్వాధీనం చేసుకొని తగు జాగ్రత్త చర్యలు తీసి కొంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది కదా!

లేఅవుట్ అంటే ప్రజలు,వారి మానవతా హక్కులు,పచ్చదనం,ఆరోగ్యం విస్మరిస్తే,ఎప్పటి లాగే పాలకులు,అథికారులు కళ్ళు మూసుకుంటే, ప్రజాస్వామ్యానికి,ప్రభుత్వానికి,పాలకులకు  రారాజులైన ప్రజలే కళ్ళు తెరిపిస్తారేమో గదా!

Related posts

ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన హిమాన్షు

Satyam NEWS

కల్లుగీత కార్మికుల కోసం సంక్షేమ పథకాలు

Satyam NEWS

అమ్రాబాద్ పులుల అభయారణ్యం: వన్యప్రాణి జనాభా వార్షిక నివేదిక

Satyam NEWS

Leave a Comment