37.2 C
Hyderabad
April 26, 2024 22: 37 PM
Slider జాతీయం

ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి

#SchoolsReopen

కరోనా విజృంభిస్తున్న వేళ విద్యార్ధుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, ఇతర ఫీజులు వసూలు చేయరాదని మధ్యప్రదేశ్ హైకోర్టు (జబల్ పూర్ బెంచ్) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అదే విధంగా స్కూలు సిబ్బంది ఎవరికీ వేతనాలలో కోత విధించరాదని ఆంక్ష పెట్టింది. ప్రతి నెల గడువు లోపున టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు పూర్తి జీతాలు చెల్లించాల్సిందేనని కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రాజీవ్ కుమార్ దూబే లతో కూడా బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ అంశాలపై దాఖలైన దాదాపు 10 పిటిషన్లను ఏకకాలంలో విచారించి న్యాయ స్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపింది.

స్కూళ్లలో పని చేసే బోధన బోధనేతర సిబ్బంది ఎవరికైనా సరే జీతం ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రయివేటు, ప్రభుత్వ, యాజమాన్య స్కూళ్లను జిల్లా కలెక్టర్లు హెచ్చరించారు.

Related posts

తవాంగ్ కు చేరుకోవడానికి టన్నెల్ మార్గం రెడీ

Satyam NEWS

కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు

Satyam NEWS

Sale – Drugs That Interact With Cbd Oil Plus Cbd Oil Hemp Softgels 60 Mg Hemp Oil Hemp Cbd Extractor Fort Lumpton Colorado

Bhavani

Leave a Comment