38.2 C
Hyderabad
April 29, 2024 20: 38 PM
Slider జాతీయం

ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్

ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్‌తో వచ్చే ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు. తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.

ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని ప్రతిరోధకాలను తప్పించుకోగలదని తేలింది. రెండు వారాల తర్వాత వ్యాధి నుండి వచ్చే ఇన్ఫెక్షన్లకు రోగనిరోధక శక్తి 14 రెట్లు పెరిగింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌ సోకిన వారిలో డెల్టాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మెరుగైన స్థాయిలో పెరుగుతున్నట్లు గుర్తించింది.

ఒకవేళ ఇదే కొనసాగితే డెల్టాతో రీ-ఇనఫెక్షన్‌ బారినపడకుండా కాపాడడంతో పాటు తీవ్రవ్యాధి నుంచి రక్షణ కల్పించడంలో ఒమిక్రాన్‌ దోహదం చేస్తున్నట్లు అంచనా వేసింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి, ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఒమిక్రాన్‌ సోకిన ఓ 33 మందిపై దక్షిణాఫ్రికా నిపుణులు అధ్యయనం చేపట్టారు.

Related posts

ఐ డోనర్: హెటేరో తో వేలాది మందికి కంటి వెలుగు

Satyam NEWS

అత్యాచార బాధితురాలికి అసభ్య ప్రశ్నలతో ఇబ్బంది

Satyam NEWS

కన్హయ్యాలాల్ కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు

Satyam NEWS

Leave a Comment