40.2 C
Hyderabad
April 29, 2024 16: 32 PM
Slider ముఖ్యంశాలు

కోటి బతుకమ్మ  చీరలు పంపిణీకి సిద్ధం

#batukammasarees

తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ  పండుగ  ఉత్సవాలు  ప్రపంచ చిత్ర పటంలో  మన   తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణుల సంతృప్తి కోసం ముఖ్యమంత్రి  కె.చంద్ర శేఖర్ రావు ప్రతి ఏడాది కోట్ల వ్యయం ఉన్నప్పటికీ  ఈ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. రంగు రంగుల వన్నెల్లో, కలర్ ఫుల్ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్  తదితర ప్రాంతాల్లో నేతన్నల తో నేయించి  రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళా సోదరిమణులకు  భారీగా పంపిణీ చేయిస్తున్నారు.

ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ చీరలు  భారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ ఏడాది 340 కోట్ల వ్యయం తో బతుకమ్మ చీరలు నెయిస్తున్నారు. 240 పైచిలుకు వెరైటీ డిజైనర్ లతో చీరలు తయారుచేసి పంపిణీకి సిద్ధం చేశారు. ఒక కోటి 18 లక్షల చీరలు  మహిళా సోదరిమణులకు పంపిణీ చేయడానికి   టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ  సన్నాహాలు చేస్తోంది.

ఈ సంవత్సరం బతుకమ్మ  చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో తయారు చేయించారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం, రాష్ట్ర అవతరణ తర్వాత ప్రతి బతుకమ్మ పండుగ సందర్భంగా  తెలంగాణ ఆడబిడ్డలకు రంగు రంగుల డిజైనలలో చీరలు పంపిణీ చేయిస్తున్నారు. త్వరలోనే పంపిణీ  కార్యక్రమం వివరాలు ఆ  శాఖ వెల్లడించనుంది.

Related posts

ఏప్రిల్ 2న టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉగాది వేడుకలు

Satyam NEWS

భగీరథ పైపు పగిలి చెరువును తలపిస్తున్న వైనం

Bhavani

దళిత బంధు కాదు ఇది.. టీఆర్ఎస్ ధనవంతుల బంధువు

Satyam NEWS

Leave a Comment