35.2 C
Hyderabad
April 27, 2024 12: 38 PM
Slider విజయనగరం

పోలీసు అమ‌ర‌వీరుల దినోత్స‌వం సంద‌ర్బంగా ఓపెన్ హ‌స్…!

#openhouse

ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ,ఏండ్రాయిడ్ ఫోన్ ల పుణ్య‌మా..ప్ర‌తీ ఒక్క‌రి గురించి  ప్ర‌తీది ఇట్టే తెలిసిపోతోంది.అందునా పోలీసుల గురించి మ‌రి చెప్ప‌క్క‌ర‌లేదు. అయితే పోలీసులు ఏయే ఆయుధాలువాడుతారు…అసలు ఎలాంటి ర‌క‌మైన వెప‌న్స్ ను ఉప‌యోగిస్తారో…ఆయా శాఖా సిబ్బందికి మిన‌హా మిగిలిన ప్ర‌పంచానికి తెలియ‌దు…తెలియ‌కూడ‌ద‌ని చెబుతోంది…పోలీస్ మాన్యువ‌ల్.

అయితే  ప్ర‌తీ ఏటా ఆక్టోబ‌ర్ 21 వ తేదీన జరిగే పోలీస్ అమ‌ర‌వీరుల దినోత్స‌వం  సంద‌ర్బంగా వారం రోజుల పాటు  పోలీస్ శాఖ ప‌బ్లిక్ కు అవ‌గాహ‌న క‌లిగించే విధంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది.అందులో భాగంగా ఓపెన్ హౌస్. ఈ  ఓపెన్ హౌస్ లో పోలీసులు వాడే ఓ గ్రానైడ్, ఓ పిస్టోల్, ఓత‌పంచా,ఓ రైఫ‌ల్,ఓ ఏకే47, ఓ ఎస్ఎల్ఆర్, అలాగే ఫింగ‌ర్ ప్రింట్స్, ఇలా దాదాదా 25 ర‌కాల వెప‌న్స్,అవి ఏయే సంద‌ర్బాల‌లో ఏయే ప‌రిస్థితుల్లో ఉప‌యోగించేది అన్న అంశాలు  ప‌బ్లిక్ కు తెలియ చెప్పేంద‌కు జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రం పోలీస్ బ్యారెక్స్ లో ఓపెన్ హౌస్ కార్య‌క్ర‌మాన్ని నిర్విహించింది.

తొలుత ఈ ఓపెన్ హౌస్ ను విశాఖ రేంజ్ డీఐజీతో ప్రారంభించాల‌ని అనుకున్న‌..విశాఖ‌రూరల్ లో ఓ కార్య‌క్ర‌మంఉండ‌టంతో  జిల్లా ఎస్పీదీపిక ఈ ఓపెన్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఓపెన్ హౌస్ లో పెట్టిన ఆయుధ సామగ్రి ప‌నితీరు..ఏయే సమ‌యాల‌లో ఏయే సిబ్బంది ఉప‌యోగిస్తారో…ముఖ్యంగా పాఠ‌శాల‌,క‌ళాశాల విద్యార్ధినీ,విద్యార్దుల‌కు ఎస్పీ వివ‌రంగా  డెమాన్ స్ట్రేష‌న్ చేసి మ‌రీ చూపించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎస్పీతో  పాటు ఓఎస్డీ సూర్య‌చంద్ర‌ర‌రావు, అద‌న‌పు ఏఎస్పీ స‌త్య‌నారాయ‌ణ‌రావు,ఏఆర్  డీఎస్పీ శేషాద్రి, స్పెష‌ల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస‌రావు,ఏఆర్ ఆడ్మిన్ చిరంజీవి, ఆర్ఐ మ‌రియ‌ణ్ రాజు ,వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ , లు ఉన్నారు.

Related posts

ట్రాజెడీ: రాజధాని కోసం ఆగిన మరో గుండె

Satyam NEWS

నీలం సహానీ పదవీకాలం మరో మూడు నెలలు పెంపు

Satyam NEWS

నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుక నిర్వహించుకుందాం

Satyam NEWS

Leave a Comment