38.2 C
Hyderabad
April 29, 2024 20: 42 PM
Slider ప్రపంచం

కరోనా సెకండ్ వేవ్: మారిన వైరస్ కు మరో కొత్త చికిత్స

#voralmedicine

సెకండ్ వేవ్ కరోనాతో అల్లకల్లోలం అవుతున్న ప్రపంచానికి అమెరికా శుభవార్త చెప్పింది. అతి త్వరలో కరోనాకు విరుగుడుగా నోటి ద్వారా తీసుకునే ఒక మందును విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

నోటి ద్వారా ఈ మందు ఐదు రోజుల పాటు తీసుకుంటే తీవ్రమైన కరోనా వైరస్ శరీరం వదిలిపెట్టి పారిపోతుంది.

మోల్నూపరివేర్ అనే పేరుతో ప్రస్తుతం పిలుస్తున్న ఈ మందును జర్మనీలోని రిజిబెల్, అమెరికాకు చెందిన మెర్క్ కంపెనీలు సంయుక్తంగా రూపొందించాయి.

ఈ మందు తొలి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మానవులపై పూర్తి అయ్యాయి.  ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

అవి పూర్తి అయిన తర్వాత ఈ మందు విడుదల చేస్తారు. అన్నీ సక్రమంగా జరిగితే మరో నాలుగు లేదా ఐదు నెలల్లో ఈ మందు విడుదల అవుతుంది.

ఈ మందును కరోనా రోగి ఇంట్లో ఉండి తన సొంతంగా తీసుకోవడానికి వీలువుంటుంది. ఐదు రోజుల్లో కరోనా పూర్తిగా తగ్గిపోతుంది.

ఈ మందును ఇన్ ఫ్లూఎంజా వైరస్ కోసం రూపొందించారు. అయితే ఇది కరోనా వైరస్ పై కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు కనుగొన్నారు.   

Related posts

చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు బ్రేక్

Satyam NEWS

స్థానిక ఎన్నికలపై జనసేనాని సంచలన నిర్ణయం

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి విశేష పూజలు

Satyam NEWS

Leave a Comment