40.2 C
Hyderabad
April 26, 2024 13: 38 PM
Slider ప్రత్యేకం

స్థానిక ఎన్నికలపై జనసేనాని సంచలన నిర్ణయం

#PawanKalyan

జెడ్.పి.టి.సి.,ఎం.పి.టి.సి.ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ (ఎస్.ఇ.సి.) తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరనసనగా  శుక్రవారం ఎస్.ఇ.సి. నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు.

రెండో తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసాము, ఆ సమావేశానికి రావలసిందిగా గురువారం సాయంత్రం ఆహ్వానాన్ని పంపిన ఎస్.ఇ.సి.  రాత్రి అయ్యేసరికి ఎన్నికలను పాత నోటిఫికేషన్ ప్రకారం కొనసాగిస్తామని, ఈ నెల 8 న పోలింగ్, 10 న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యగా  జనసేన భావిస్తోందని ఆయన తెలిపారు.

ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు రాక ముందే ఎస్.ఇ.సి. ఇటువంటి దురదృష్టకరమైన నిర్ణయం  తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.

ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ది చేకూర్చడానికేనని జనసేన భావిస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు.

Related posts

లాక్‌డౌన్ వేళ ఇంటిల్లిపాదీ వినోద వేదికగా స్టార్ మా

Satyam NEWS

ఎలర్ట్: కొల్లాపూర్ పట్టణంలో 144 సెక్షన్ అమలు

Satyam NEWS

బెల్లం పట్టివేత-కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment