30.3 C
Hyderabad
March 15, 2025 09: 57 AM
Slider మహబూబ్ నగర్

రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సంక్షేమ దీక్ష

#Nagarkurnool Congress

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో లాక్ డౌన్ సందర్భంగా రైతులకు అండగా ఉండడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు  రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇంట్లోనే రైతు  సంక్షేమ దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి  మిరియాల శ్రీనివాస్  మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పంటల సేకరణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

జిల్లా వ్యాప్తంగా దాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు కొరత ఏర్పడడంతో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని దీనితో అకాల వర్షాల వల్ల తీవ్రంగా రైతులు నష్టపోతున్నారని, అయినా అప్పటికి ప్రభుత్వం సరైన దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related posts

గ్రూప్‌-1 కటాఫ్ 75-85 మధ్యలోనే |

Satyam NEWS

కొల్లాపూర్ మహిళల కోసం ప్రత్యేక యోగా భవనం

Satyam NEWS

దత్త సంస్థలకు మేలు చేస్తున్న ప్రధాని మోడీ

Satyam NEWS

Leave a Comment