యాసంగి ధాన్యం కొనుగోళ్ళలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లను ఆదేశించారు. ఐకెపి సెంటర్లు, పిఎసిఎస్ లు, మార్కెట్ కమిటీల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
లక్ష టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎఫ్ సిఐ సిద్ధంగా ఉందని అన్నారు. సోమవారం అత్యవసర సమీక్ష నిర్వహించి ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని సీఎం సీఎస్ ను ఆదేశించారు.