38.2 C
Hyderabad
May 1, 2024 19: 36 PM
Slider హైదరాబాద్

జ‌ల్‌ప‌ల్లి క‌మాన్ ద‌గ్గ‌ర యువ‌తి దారుణ‌ హ‌త్య‌..

pahadi Shareef PS

ప‌హాడీష‌రీఫ్ పీఎస్ ప‌రిధిలోని జ‌ల్‌ప‌ల్లి క‌మాన్ రోడ్డులో నిర్మాణుష్య ప్రాంతంలోని ఓ మ‌హిళ మృత‌దేహాన్ని స్థానికులు చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. విష‌యం తెలుసుకున్నఎల్బీన‌గ‌ర్ డీసీపీ స‌న్‌ప్రీత్‌సింగ్‌, వ‌న‌స్థ‌లిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ప‌హాడీష‌రీఫ్ ఇన్స్‌పెక్ట‌ర్ ఎస్‌. విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలు అక్క‌డికి చేరుకొని ప‌రిస్థితిని స‌మీక్షించారు. చ‌నిపోయిన యువ‌తి సుమారు 25 నుంచి 30 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌న్నారు. ఆమెపై సామూహిక అ‌త్యాచారం జ‌రిగిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా డాగ్ స్క్వాడ్ యువ‌తి మృత‌దేహాం స్థ‌లం నుంచి కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో స్నేక్‌గ్యాంగ్ చేసిన ఆగ‌డాలు గ‌తంలో ఇక్క‌డే జ‌ర‌గ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ప‌రిస‌రాల్లోని సీసీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

ఎవ‌రీ స్నేక్ గ్యాంగ్ ఏంటా క‌థా క‌మామీషు..

స్నేక్ గ్యాంగ్ ప‌హాడీష‌రీఫ్‌లోని వీరి అరాచ‌కాల‌కు గ‌తంలో అంతులేకుండా పోయింది. పాముల‌తో అమాయ‌క‌మైన మ‌హిళ‌ల‌ను బెదిరించి అ‌త్యాచారం చేయ‌డం, అరాచ‌కాలకు పాల్ప‌డ‌డం వంటి చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డేవారు. ఈ గ్యాంగ్‌కు ప్ర‌ధాన సూత్ర‌ధారి ఫైజ‌ల్ ద‌యానీ 2014లో ఓ మ‌హిళ‌పై అ‌త్యా‌చారం కేసుతో వీరి ఆగ‌డాల‌కు పోలీసులు చెక్ పెట్టారు. అప్ప‌ట్లో ఓ ఫౌంహౌస్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై తెలంగాణ వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఫైజ‌ల్ ద‌యానీకి స్థానికంగా ఉన్న(పాత‌బ‌స్తీ)లోని ఓ రాజ‌కీయ పార్టీతో సంబంధాలున్నాయ‌ని అందుకే వీరి ఆగ‌డాల‌ను బ‌య‌ట‌కు చెప్పుకునేందుకు కూడా స్థానికులు బ‌య‌ప‌డేవార‌ని స‌మాచారం. కాగా వీరి ఆగ‌డాల‌ను స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న‌కొద్దిమంది పోలీసుల‌కు తెలిసి ఉన్న‌తాధికారులకు వీరి ఆగ‌డాల చిట్టా తీసుకువెళితే స్నేక్‌గ్యాంగ్ పోలీసుల‌పై కూడా దాడుల‌కు పాల్ప‌డేవార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌ట్లో ఈ గ్యాంగ్ ఆగ‌డాల‌ను ప‌లు మీడియా సంస్థ‌లు ప్ర‌సారం చేయ‌డంతో వీరి ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డింది.

సీవీ ఆనంద్ భారీ సెర్చ్ ఆప‌రేష‌న్‌తో స్నేక్‌గ్యాంగ్ ఆట‌క‌ట్టు

2014 ఘ‌ట‌న అనంత‌రం పోలీసులు సీవీ ఆనంద్ 420 మంది పోలీసుల‌తో ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ సెర్చ్ నిర్వ‌హించి స్నేక్‌గ్యాంగ్ సూత్ర‌ధారి, సోద‌రులు, మ‌రో ఐదుగురి స‌భ్యుల‌ను అరెస్టు చేశారు. స్నేక్ గ్యాంగ్ స‌భ్యులు మ‌హిళ‌ల‌పై అ‌త్యాచారం చేయ‌డ‌మే గాకుండా వీడియోల్లో చిత్రీక‌రించి ఎవ్వ‌రికైనా చెబితే ఆయా వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పెడ‌తామ‌ని హెచ్చ‌రించేవారు. స్థానికంగా పాముల‌ను ప‌ట్టుకొని వాటిని చూపిస్తూ యువ‌తులు, మ‌హిళ‌ల‌పై అ‌త్యాచారాల‌కు పాల్ప‌డేవార‌ని విచార‌ణ‌లో తేలింది. ఆయా వీడియోలు బ‌య‌ట‌కి పొక్కి ఓ ప్రైవేట్ చాన‌ల్ ప్ర‌సారం చేయ‌డంతో ఆ చాన‌ల్‌పై కూడా అప్ప‌టి డీసీపీ జాన‌కీ ష‌ర్మిల కేసు న‌మోదు చేసి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన విష‌యాలు విదిత‌మే.

Related posts

తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి కాసుల మాల

Satyam NEWS

యురేనియం వ్యర్ధాలపై నిపుణుల కమిటీ

Satyam NEWS

రాజకీయాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థల పనితీరుపై అనుమానాలు

Bhavani

Leave a Comment