40.2 C
Hyderabad
April 26, 2024 11: 54 AM
Slider ప్రత్యేకం

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇక నుంచి ప్రత్యేక ఎకౌంట్లు?

#Narendra Modi

వివిధ పథకాలకు కేంద్ర ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్ధిక శాఖ భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు కాగానే అమలు చేసేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ ఉద్యుక్తమౌతున్నది. కేంద్రం తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాల ‘‘నిధుల మళ్లింపు’’ ఆటలకు అడ్డుకట్ట పడబోతున్నది. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని తమకు కావాల్సిన, తమ ప్రాధాన్యతా పథకాలకు మళ్లింపులు చేసుకుంటున్నారు. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు దక్కడం లేదు. దేశంలో పేదరికం నిర్మూలనకు కేంద్రం అమలు చేసే పలు పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తుండటంతో ఫలితాలు రావడం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం అందుకు విరుగుడు ఆలోచిస్తున్నది. వివిధ పథకాలకు ఇచ్చే నిధుల కోసం ఆ పథకం పేరుతో ఒక ప్రత్యేక బ్యాంకు ఎకౌంట్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నది. ఈ ఎకౌంట్ నుంచి నిధులను కదిలించాలంటే సంబంధిత కార్యక్రమానికి అయితేనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు మాత్రంమే ఆ ఎకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కదిలించే అవకాశం ఉంటంది. ప్రస్తుతానికి కేంద్రం ముందుగా నిధులు పంపితే వాటిని వినియోగించుకుని ఆ తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం అందచేయాల్సి ఉంటుంది. కేంద్రం నిధులు ఇవ్వడానికి, రాష్ట్రం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి మధ్య చాలా కాలం పడుతున్నది. అదే విధంగా కేంద్రం ఇచ్చే నిధులను వాడుకుంటూ కేంద్రం నుంచి పైసా కూడా రాలేదు అని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటు అయిపోయింది. బిజెపియేతర రాష్ట్రాలతో ఈ బెడద ఎక్కువగా ఉంటున్నది. కొన్ని పథకాలకు కేంద్రం నూటికి నూరు శాతం గ్రాంటుగా ఇస్తుంది. మరి కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఇంకొన్ని పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలు ఉంటాయి. ప్రస్తుతం అన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో పడిపోతుండటంతో వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు యథేచ్ఛగా తమకు కావాల్సిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లించుకుంటున్నాయి. ఇక నుంచి అలా కుదిరేపని కాదు. ఉదాహరణకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం ఉంటే దానికి సంబంధించి కేంద్రమే ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరుస్తుంది. ఆ నిధులను సంబంధిత లబ్దిదారులకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ పేరు పెట్టుకునేందుకు ఇక వీలుఉండదు. కేంద్ర ప్రభుత్వం సూచించిన పేరుతోనే పథకం అమలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పథకాలకు చెక్కులు ఎవరి పేరుతో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనే వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్రాల జోక్యం అసలు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మళ్లించినట్లు కేంద్రానికి తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే బడ్జెట్ నిధుల నుంచి మినహాయించుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనపు అప్పులు చేసి దివాలా తీయకుండా ఉంటాయని ఆర్ధిక రంగ నిపుణులు కేంద్రానికి సూచించారు.

Related posts

తీవ్ర రూపం దాల్చిన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదం

Bhavani

కరోనా సోకడంపై వివరణ ఇచ్చిన అల్లూ అరవింద్

Satyam NEWS

అందరిని అలరించిన పౌరాణిక నాటక ప్రదర్శనలు

Satyam NEWS

Leave a Comment