26.7 C
Hyderabad
May 3, 2024 10: 48 AM
Slider ప్రత్యేకం

ప్రధాని సలహాలు సూచనలు పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి పాటించాలి

#primeminister

విద్యార్థులు పరీక్షల సమయాన్ని ఆందోళనతో కాకుండా ఒక పండగ వాతావరణంగా భావించాలని పరీక్షలు ఎప్పుడూ పండగల సమయంలోనే వస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోది విద్యార్థులకు పిలుపునిచ్చారు.

శుక్రవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది దిల్లిలోని తల్కతోర స్టేడియం  నుండి  ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పరీక్ష పే చర్చ కార్యక్రమం ద్వారా మాట్లాడి విద్యార్థులకు పరీక్షల పై ఉన్న భయాందోళనలు దూరం చేస్తూ  సందేహాలను నివృత్తి చేసారు.

ప్రధానితో మాట్లాడిన విద్యార్ధులు

దేశంలోని నలుమూలల నుండి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోది సమాధానం ఇచ్చారు.  ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా నుండి దాదాపు అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలల నుండి విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.

కొల్లాపూర్ గాంధీ మెమోరియల్   ఉన్నత పాఠశాలలో విద్యార్థులు  ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తుండగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ పరీక్షలు అనేవి ప్రతి వ్యక్తీ జీవితంలో ఒక భాగమని దీనిని ఆందోళనతో కాకుండా పండుగ అనుకోని విద్యార్థులు స్వేచ్చగా పరీక్షలు రాయాలన్నారు.  పరీక్షల కంటే ముందు విద్యార్థులు తరగతి గదిలో ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎన్నో రోజులు ఇంట్లో చదువుకొని సాటి విద్యార్థులతో మాట్లాడి  అవగాహన చేసుకోని ఉంటారని అలాంటిది పరీక్షలు మాముందు ఎంత అనే ధీమాతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలని సూచించారు. 

విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు.  ఒకప్పుడు పాటాలు చెప్పే ఉపాధ్యాయునికి, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఒక ఆప్యాయ బంధం ఉండేదని విద్యార్థి బలము వారి అభిరుచులు అటు తల్లిదండ్రుల ఆకాంక్ష ఉపాధ్యాయునికి కలిపి ఒకే అభిప్రాయం తో ఉండేవారన్నారు.  మారిన పరిస్థిలో పిల్లలు ఎం నేర్చుకుంటున్నారు వారి అభిరుచులు ఏంటి అనేది ఇటు తల్లిదండ్రులకు అటు ఉపాధ్యాయులకు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.

మీ అభిప్రాయాన్ని పిల్లలపై బలవంతంగా రుద్దవద్దు 

తల్లిదండ్రులు సాధించలేనిది, వారు సమాజంలో చూసినది మా పిల్లలు ఇది సాధించాలని వారి అభిప్రాయాన్ని పిల్లలపై బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. భగవంతుడు  ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవిధంగా చేస్తాడని తమ పిల్లలలో ఉన్న ఆ ప్రత్యేకతను గుర్తించాల్సిన బాధ్యతా తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయునికి ఉంటుదన్నారు.  విద్యార్థులు అభిరుచికి అనుగుణముగా తర్ఫీదు ఇస్తే ఎన్నో విజయాలు సాదిస్తారన్నారు.  ఉపాధ్యాయుడు పాటాలు చెబుతుంటే బాగానే అర్థమవుతాయని, వాటిని చదువుకొని పరీక్షలకు వెళ్ళినప్పుడు అదే ప్రశ్నకు సమాధానం అప్పుడు గుర్తుకు రాదు ఎందుకని ప్రధాన మంత్రిని ఆన్లైన్ వీడియో ద్వారా ప్రశ్నించారు.

అనుష అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానమిస్తూ మన శరీరం కొన్ని సార్లు మనకు సహకరించదని, అదే విధంగా మనుసు సైతం మనకు మోసం చేస్తుందన్నారు.  ముందు ఉపాధ్యాయుడు  పాటాలు చెబుతుంటే మన మనుసు అక్కడ ఉండకుండా ఇంట్లో లేదా మన స్నేహితుల వైపు వెళుతుందన్నారు.  అలాంటి సమయంలో విన్న పాటాలు, చదువుకున్న సమాధానాలు అసలు సమయంలో గుర్తుకు రావన్నారు. 

మాములుగా మనకు ఇష్టమైన వైపు మాత్రమే కాకుండా మనకు బాగా ఉపయోగపడే వైపు కష్టమైన సరే అటువైపే మన ధ్యాస ఆలోచనలు పెట్టాలని అప్పుడే విజయాలు మన సొంతమవుతయన్నారు.  పోటీ అనేది చాలా మంచిదని పోటి ఉన్నప్పుడే మనము అత్యుత్తమంగా తయారు అవుతామని తేల్చిచెప్పారు.  ఆన్లైన్ ఆఫ్ లైన్ పై మాట్లాడుతూ ఆన్లైన్  ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చని దానికి అవధుల్లెవన్నారు. 

అఫ్ లైన్ అనేది తెలుసుకున్నది రుజువుచేస్తూ  నేర్చుకుంటూ   వెళ్ళేదన్నారు.  అమ్మాయిల పై మాట్లాడుతూ అన్ని రంగాల్లో అమ్మాయిలు ముందు వరుసలలో నిలుస్తున్నారని అమ్మాయిలు కలిగి ఉండటం ఆ ఇంటికి అదనపు  బలంతో పాటు అదృష్టంగా మారిందన్నారు.  అందుకే అమ్మాయిలు అబ్బాయిలను తల్లిదండ్రులు సమాన దృష్టితో చూడాలని కోరారు. 

పరిక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చుసిన ప్రభుత్వ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు  పదవ తరగతి పరిక్షలు రాస్తున్న తమకు ప్రధాని మాటలు ఏంతో ఉత్సాహాని, ధైర్యాన్ని ఇచ్చాయనన్నారు.  తమలో ఉన్న చిన్న చిన్న ఆందోళనలు దూరమై పరిక్షలు ఉత్సాహంగా రాసే విధంగా ప్రతి సమస్యను వివరంగా వివరించారని తెలిపారు.

పరిక్షా పే చర్చ కార్యక్రమం తర్వాత పరిక్షలంటే భయపడే మా స్నేహితులు కూడా ధైర్యంగా పరీక్షలు రాసేందుకు ఉత్సాహంగా ఉన్నారని విద్యార్థులు తెలిపారు.

జిల్లా విద్యాశాఖ అధికారి డిఇఓ గోవిందరాజులు మాట్లాడుతూ పరీక్షల సమయంలో ప్రధానమంత్రి పరిక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ధైర్యాన్ని ఇస్తూ వివరనాత్మకంగా సందేహాలను నివృత్తి చేయడం విద్యార్థులకు ఏంటో మేలు కలిగిస్తున్నందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం కొల్లాపూర్ పట్టణం లో జరుగుతున్న ఆన్లైన్ శిక్షణ తరగతులను సందర్శించి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారి సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, కోర్స్ డైరెక్టర్ లు, ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం బహిరంగ సభకు భారీగా తరలిన టిడిపి శ్రేణులు

Satyam NEWS

జనసేన సభ్యత్వం ఉంటే రూ.5లక్షల భీమా ఉన్నట్లే

Satyam NEWS

స్టార్ వార్స్: ‘గోన గన్నా రెడ్డి’

Satyam NEWS

Leave a Comment