32.7 C
Hyderabad
April 26, 2024 23: 15 PM
Slider మహబూబ్ నగర్

పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

#malachitanyasamiti

నూతన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మాలల చైతన్య సమితి కమిటీ ఎన్నిక నేడు టీఎన్జీవో భవనంలో జరిగింది. అనంతరం మూలే కేశవులు మాట్లాడుతూ భారతదేశానికి దశ దిశ నిర్దేశించి ప్రపంచ దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగానికి ఉన్నత ప్రమాణాలు తీసుకువచ్చిన అంబేద్కర్ కు దేశం సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాలకు స్వేచ్ఛ సమానత తో కూడిన హక్కులు కల్పించి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లతో పాటు ఓటు హక్కును కల్పించి సమాజంలో ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో జీవించాలని ఆయన ఆశించారని కేశవులు అన్నారు. మహా మేధావి విశ్వవిజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నూతన పార్లమెంటు భవనానికి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అచ్చంపేట నియోజకవర్గం కమిటీ అధ్యక్షులుగా పంబ వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా గోవు విష్ణు, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి మల్లేష్, కోశాధికారిగా నారమళ్ళ తిరుపతయ్య, సహాయ కార్యదర్శిగా ఆలూరి బాలచంద్రయ్య, ప్రచార కార్యదర్శిగా చిక్కుడు కొండలు, కోఆర్డినేటర్ గా పిల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మండల సుధాకర్, అధికార ప్రతినిధిగా గోకం బాలచందర్, సలహాదారులుగా వేదవ్యాస్ వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఐదు మంది ఈసీ నెంబర్లుగా ఎన్నికయ్యారు. మూలే కేశవులు వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు శ్రావణ్ కుమార్ చింతపల్లి శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరం

Satyam NEWS

నిండిన ప్రధాన కాలువ:పట్టించుకోని నీటి పారుదల అధికారులు

Satyam NEWS

చివరికి బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

Bhavani

Leave a Comment