32.7 C
Hyderabad
April 27, 2024 00: 18 AM
Slider మహబూబ్ నగర్

పట్టణ ప్రగతి అంటే ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడమా?

kollapur pattanapragathi

పట్టణ ప్రగతి అంటే ఏమిటి? ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినదేమిటో గానీ కొల్లాపూర్ లో మాత్రం పట్టణ ప్రగతి అంటే రాజకీయ కక్ష లు తీర్చుకోవడమే. ఇటీవల ముగిసిన ఎన్నికలలో తమకు మద్దతు ఇవ్వని వారిని ఎంపిక చేసుకుని వారి ఇళ్ల ప్రహరీ గోడలు కూలగొట్టడం ధ్యేయంగా కొల్లాపూర్ మునిసిపాలిటీలో పట్టణ ప్రగతి సాగుతున్నది.

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో గోడలు కూల్చి వేయడంలో రాజకీయం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు వంగ రాజశేఖర్ గౌడ్. గోడలు కూల్చాల్సిన సమయంలో కొందరికి రెండు నెలల సమయం ఇస్తున్నారని, మరి కొందరికి సమయం ఇవ్వకుండా జేసిబిలతో  గోడలను కూల్చేస్తున్నారని ఆయన అంటున్నారు. పట్టణం ప్రగతిలో మేము కూడా భాగస్వాములు అవుతాం.

కొందరు వారి ఆనందం కొరకు రాజకీయం చేస్తూన్నారు. పట్టణ ప్రగతిని పక్కదారి పట్టిస్తున్నారు. దీనికి కొందరు అధికారులు కూడా మద్దతు పలుకుతున్నారు అని వంగ రాజశేఖర్ గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అంటే 10 రోజుల్లో వార్డు కు సంబంధించిన సమస్యలను సేకరించాలి. అధికారులకు తెలియజేయాలి.

సమస్యల కొరకు నిధులు విడుదల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. అలా కాకుండా వర్గ విభేదాలతో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. కంప చెట్లను,ముళ్ల పొదలను, విద్యుత్, రోడ్లు, అపరిశుభ్రత లాంటి పలు సమస్యలను పరిష్కరించాలి. వార్డును ప్రగతి బాటలో నడిపించాలి. ఇందులో అందరికీ బాధ్యత ఉంది.

అలా కాకుండా కేవలం రాజకీయం చేస్తూ అనుకూలంగా ఉన్న వారి గోడలను కూల్చేయకుండా రెండు నెలలు సమయం ఇస్తున్నారు. ప్రత్యర్థుల వర్గ వారిని గుర్తించి సమయం ఇవ్వకుండా ఇండ్లకు సంబంధించిన గోడలను కూల్చేస్తున్నారు. అధికారులు స్పందించాలని వంగ రాజశేఖర్ గౌడ్  విన్నవిస్తున్నారు.

సంఘటనకు కారకులైన వారి పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వంగ రాజశేఖర్ గౌడ్ అంటున్నారు. 15వార్డు కౌన్సిలర్ తో స్థానిక అధికారులు జత కట్టారని ఆరోపిస్తున్నారు.

Related posts

అశోకుని అంతటి ధీశాలి శ్రీకృష్ణదేవరాయలు

Bhavani

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

Satyam NEWS

బీజేపీ గూటికి వైసీపీ నేత ఏలూరి రామచంద్రారెడ్డి

Satyam NEWS

Leave a Comment