28.7 C
Hyderabad
April 28, 2024 09: 56 AM
Slider ముఖ్యంశాలు

విధుల్లో ఉన్న ఎస్ఐ పైనే దుర్భాషలాడిన వ్యక్తులు…!

#People abused

విజయనగరం జిల్లా ప్రశాంతత కు మారు పేరు.. విజయనగరం జిల్లా విద్యలనగరం… ఏడాదికో ఘటన తప్ప…మిగిలిన అన్ని రోజులు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన.. జిల్లా కు ప్రశాంతత పేరును…తద్వారా… ఫోర్త్ ఎస్టేట్ లో ఒక్క టైన జర్నలిజం పైనే మచ్చ పడే పరిస్థితి ఏర్పడందని అంటోంది…”సత్యం న్యూస్.

నెట్”.వివరాల్లోకి వెళితే… జిల్లా పోలీసు శాఖలో… ఆ లేడీ ఎస్ఐ కి మంచి పేరు ఉంది. కరోనా సమయంలో అప్పటి జిల్లా పోలీసు బాస్ ,ఎస్పీ రాజకుమారి… సూచనలు, ఆదేశాలతో… క్షణం ఆలస్యం చేయకుండా… కుటుంబాన్నే వదిలి ప్రజల కోసం అనునిత్యం రోడ్ల మీదనే విధులు నిర్వహించారా ఎస్ఐ. విజయనగరం వన్ టౌన్, వల్లంపూడి…తాజాగా కొత్తవలస ఎస్ఐ గా పని చేస్తున్న ఎస్ఐ దేవీ గురించే…”సత్యం న్యూస్.

నెట్” చెప్పబోతోంది.పోలీసులు.. ఖాకీ యూనిఫామ్…తెచ్చి పెట్టే ఖ్యాతి వర్ణించలేనిది. యూనిఫామ్ ధరించే ప్రతీ ఒక్క ఆఫీసర్ నిబధ్ధత…నిజాయితీ,.. క్రమ శిక్షణ కు నిలువటద్దంలా భావించి పని చేస్తారు. అలాంటి ఖాకీ యూనీఫాం ధరించే కొత్తవలస ఎస్ఐ దేవీ…నడి రోడ్ పై కన్నీళ్లు పెట్టుకోవడం..”సత్యం న్యూస్. నెట్” కెమారా కంట పడింది. తన స్టేషన్ ముందు ఉన్న పశువుల వ్యాన్ ను ఆపి చలనా వేయడమే సదరు ఎస్ఐ తప్పిదం.వెంటనే నలుగురు… మీడియా

వ్యక్తులంటూ వచ్చి… అందులో ఒకరు… కొత్త వలస ఎస్ఐ ని “అసలు నీకు పోలీసు ఉద్యోగం ఎవరు ఇచ్చారే” అంటూ వ్యక్తి గత దూషణలకు దిగడమే కాక పరుషపదజాలాలు వాడటమే కాక పబ్లిక్ గా నడి రోడ్ పై..అదీ తాను పని చేసే స్టేషన్ ముందే ఈ ఘటన జరగడంతో ఎస్ఐ దేవీ…వెంటనే సీఐ బాల సూర్య రావుకు మ్యాన్ ప్యాక్ లో పరిస్థితి వివరించగా హుటాహుటిన సదరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్టేషన్ రావడంతో… సదరు అధికారి ముందే ఎస్ఐ దేవీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

వెంటనే వాళ్ల గురించి ఆరా తీస్తే.. గతంలో వారిపై కేసులు కూడా ఉన్నాయన తేలడంతో ప్రత్యేకంగా… డ్యూటీ ఉన్న ఎస్ఐ ని తిట్టినందుకు గాను…అయిదు కేసులు నమోదు చేసామని..అలాగే బ్లాక్ మెయింగ్ కేసు పెట్టినట్లు ఎస్.కోట సీఐ బాల సూర్య రావు తెలిపారు. ఏదైనా… నడిరోడ్డుపై విధుల్లో ఉండే ఓ సబ్ ఇన్ స్పెక్టర్ కంటతడి పెట్టడం… పర్యవసనంగా…పోలీసు శాఖ కే తీరని కళంకం అని “సత్యం న్యూస్. నెట్”..అంటోంది.

Related posts

కరోనా ఎఫెక్ట్: టీటీడీ అధికారుల వ్యవహారశైలిపై విచారణ జరపాలి

Satyam NEWS

స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలు బందోబస్తు

Satyam NEWS

గుర్తు తెలియని వాహనం ఢీ: పసిపాప సహా ముగ్గురి మృతి

Satyam NEWS

Leave a Comment