33.7 C
Hyderabad
April 28, 2024 00: 03 AM
Slider నిజామాబాద్

గుడ్ వర్క్: పోచారం ట్రస్ట్ ద్వారా బియ్యం పంపిణీ

pocharam trust

కరోనా వైరస్ వల్ల పనులు లేక తీవ్రంగా నష్టపోతున్న నిరుపేదలు,కూలీలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో పోచారం ట్రస్ట్ ద్వారా అందజేసిన 283 బియ్యం బ్యాగులను మండల టీఆరెస్ నాయకులు ఆదివారం నిరుపేదలకు పంపిణీ చేశారు.

కోటగిరి మండల కేంద్రంలో 80 బ్యాగులను సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పేదలకు జడ్పీటీసీ శంకర్ పటేల్, ఏఎంసీ చైర్మన్ గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ లు నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వల్లేపల్లి శ్రీనివాస్ కరోనా వైరస్ వల్ల ప్రపంచం తల్లడిల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత దేశంలో ముందు చూపుతో లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోయినా… నిరుపేదలకు,కూలీలకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసిందని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు కూడా ఉచితంగా బియ్యం,500 రూ.ల.నగదు పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. కొందరు కొత్త రేషన్ కార్డుల అప్లై చేసుకున్నా పెండింగ్ లో ఉండటంతో వారికి గవర్నమెంట్ నుండి బియ్యం అందలేదని, రేషన్ కార్డులు పెండింగులో ఉన్న నిరుపేదలకు లాక్ డౌన్ వల్ల  పనిలేక పూట గడవటానికి ఇబ్బందులు పడుతున్నందున వారికి పోచారం ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన వంతు సహాయంగా అందిస్తున్నారని అన్నారు.

తొలివిడత లో బాన్సువాడ నియోజకవర్గంలో 1340 మందికి ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయటం జరుగుతుందని తెలిపారు. కోటగిరి మండలంలో 283 బ్యాగులను పంచుతున్నామని అన్నారు. ఈ బ్యాగులతో అందరు నిరుపేదలకు బియ్యం అందకపోతే స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి మరికొందరికి బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోటగిరి పీఏసీస్ చైర్మన్ కూచి సిద్ధు, టీఆరెస్ మండలాధ్యక్షుడు ఎజాస్ ఖాన్, నాయకులు సలీం, బీర్కూర్ గంగాధర్, కొయిగూర్ సాయిలు, అనిల్ కులకర్ణి, దాయనంద్, అర్షద్,నజీర్,విజయ్ పటేల్, రాములు, డాక్టర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పుస్తకాలతో మేధో సంపద పెరుగుతుంది

Satyam NEWS

ఫిరాయింపులు ప్రోత్సహిస్తే పుట్టగతులు లేకుండా చేస్తాం!

Bhavani

సీఎం కేసీఆర్ భేటీ!!!

Sub Editor

Leave a Comment