38.2 C
Hyderabad
April 29, 2024 22: 15 PM
Slider ప్రత్యేకం

హిందూత్వం పై కవితలకు ఆహ్వానం

#oldcitypoets

హైదరాబాద్ పాత నగర కవుల వేదిక (లాల్ దర్వాజా) హిందూత్వం పై కవితలను ఆహ్వానిస్తున్నది. ప్రముఖ కవులు, కవయిత్రులతో బాటు వర్ధమాన రచయితలు కూడా ఇందులో పాల్గొనవచ్చునని హైదరాబాద్ పాత నగర కవుల వేదిక కన్వీనర్ కే. హరనాథ్ తెలిపారు.

హిందూత్వం ఒక సనాతన ధర్మం. హిందూత్వం ఎవరో ఒకరు కనుగొన్న మతం కాదు. చరిత్రకు అందనటువంటి పురాతనమైనది ఈ ధర్మం. కాల ప్రవాహంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడుతూ, నిరంతర ప్రవాహంలా హిందూమతం సాగిపోతూనే ఉంది.

హిందూత్వం మూలాలు వేదకాలం నాటివి. ఈ ధర్మంపై వినూత్నమైన కవితా సంకలనాన్ని వెలువరించాలనేది తమ సంకల్పం అని హరనాథ్ తెలిపారు. హిందూ సమాజాన్ని మరింత ఉత్తేజ పరిచాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ పాత నగర కవుల వేదిక కవితలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందూత్వంపై వచ్చిన కవితలలో ఎంపిక చేసిన వాటిని సత్యంన్యూస్.నెట్ ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ లో ప్రచురిస్తామని ఆయన తెలిపారు.

ఆ తర్వాత వాటన్నింటిని సంకలనం చేసి పుస్తకం గా తీసుకువస్తామని హరనాథ్ తెలిపారు. కవితలను జూన్ 25వ తేదీ లోగా 9703542598, 9182178653కి టెక్ట్స్ ఫైల్ వాట్సయాప్ చేయాలని, కవిత్వం 25 లైన్లకు మించకుండా ఉండాలని ఆయన తెలిపారు.

పిడిఎఫ్ ఫైల్ పంపవద్దని ఆయన సూచించారు. రచయిత తమ పాస్ పోర్టు ఫొటో కూడా పంపాలని హరనాథ్ కోరారు. కవులు, కవయిత్రులు తమ కవిత్వంలో రాజకీయ అంశాలు జొప్పించకుండా ఉండాలని ఆయన కోరారు. తాము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాజకీయ అవసరాల కోసం కాదని ఆయన వివరించారు.

Related posts

పూసపాటి బాలాజి కి జాతీయ స్థాయి సేవారత్న పురస్కారం

Satyam NEWS

ఉపాధ్యాయ స‌మ‌స్య‌ల‌ సాధనకు ప్ర‌భుత్వంపై యుద్దానికి కార్యాచర‌ణ‌

Satyam NEWS

ఆపదలో ఉన్నప్పుడు నిస్సందేహంగా డయల్ 100

Satyam NEWS

Leave a Comment