29.7 C
Hyderabad
April 29, 2024 10: 24 AM
Slider విజయనగరం

ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న‌, దిశ యాప్ పై అవ‌గాహ‌న‌, త్రిబుల్ డ్రైవింగ్ ల‌పై ఝ‌ల‌క్

ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న‌,దిశ యాప్ పై అవ‌గాహ‌న‌,త్రిబుల్ డ్రైవింగ్ వంటి అంశాల‌పై విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసులు దృష్టి పెట్టి…నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించిన వాళ్ల‌కు ఓ ఝ‌ల‌క్ ఇస్తున్నారు… పోలీసులు. జిల్లా ఎస్పీఆదేశాల‌తో… పోలీస్ బాస్ ప‌ర్య‌వేక్ష‌లో ఆపరేషన్ పరివర్తన 2.0 లో భాగంగా మద్యం అక్రమ రవాణదారులపై స్థానిక పోలీసులు మరియు ఎస్ఈ బీ పోలీసులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా రైడ్స్ నిర్వహించి, ఒక కేసు నమోదు చేసి, ఒక్కరిని అరెస్టు చేసి, 2.16 లీటర్ల ఐ.ఎం.ఎల్.ఎఫ్. మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా నాటుసారా తయారీకి సిద్దం చేసుకొన్న 100 లీటర్ల బెల్లం ఊటను, సారా తయారీకి వినియోగించే వంట పాత్రలు, డ్రమ్ములను ధ్వంసం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలుస్తున్న వారిపై 30 కేసులను పోలీసులు నమోదు చేశారు.

అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 18 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఇక హెల్మెట్ లు, సీటు బెల్టులు ధరించకుండా అలాగే అతి వేగంగా వాహ‌నాలు నడిపిన, ఎంవి నిబంధనలను అతిక్రమించిన వారిపైన 544 కేసులను నమోదు చేసి, ల‌క్షా 19 వేల ,690 రూపాయ‌ల‌ ఈ-చలానగా విధించారు.

ఇక దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టి, 4,243 మంది దిశా యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 4,33,050 కు చేరిందంటోంది…. జిల్లా పోలీస్ శాఖ‌.

Related posts

బండి సంజయ్ పాదయాత్ర తో ప్రజల్లో వెలిగిన చైతన్య జ్యోతి

Satyam NEWS

Talking Point: జగన్ ప్లేస్ లో నేనే కనుక ఉంటే….

Satyam NEWS

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. బలమైన ఆధారాలు

Satyam NEWS

Leave a Comment