32.7 C
Hyderabad
April 26, 2024 23: 34 PM
Slider తెలంగాణ

దిగ్విజయంగా మెగా రక్తదాన శిబిరం

pjimage (20)

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లోఘనంగా  నిర్వహించారు. అక్టోబర్21న జరగబోయే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు ఈ నెల 15 నుండి ప్రారంభమయ్యాయి. గురువారం కొల్లాపూర్ సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో  రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారిచే మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా  మెగా రక్తదాన శిబిరాన్ని సీఐ బి.వెంకట్ రెడ్డి, ఎసై కొంపల్లి మురళి గౌడ్, పెంట్ల వెళ్లి, కోడేర్, పెద్ద కొత్త పల్లి ఎసై లు సిబ్బంది రక్తదానం చేశారు. అంతకు ముందు ముఖ్య అతిథిగా డీఎస్సీ లక్ష్మి నారాయణ హాజరయ్యారు. అమరులైన ఎస్పీ జి.పరదేశి నాయుడు చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం సిఐ వెంకట్ రెడ్డి అధ్యక్షతన డిఎస్పీ లక్ష్మినారాయణ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రిటెయిర్డ్ ఆర్మీ రమేష్ ముదిరాజ్ తో పాటు జర్నలిస్ట్ లు రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు అనుచరవర్గం కొల్లాపూర్ టిఆర్ఎస్ యువనాయకులు నరసింహ్మ రావు బృందం బాల స్వరూప్, పసుల వెంకటేష్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అనుచర వర్గం వురి హరి సురేష్, శివ, సురేష్ భజరంగ్  దళ్ పురెందర్, సభ్యులు,ఏబీవీపీ రాష్ట నాయకులు మెంటే శివకృష్ణ, సత్యనారాయణ గౌడ్ తదితరులు కోడేర్  మండలానికి చెందిన యువత రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా 119 మంది రక్తదానం చేశారు. గత రెండు రోజుల నుండి సీఐ వెంకట్ రెడ్డి, ఎస్ఐ మురళి గౌడ్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. మొత్తానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి కి భజరంగ్ దళ్ ఏబీవీపీ సభ్యులు పట్టణ కేంద్రంలో బ్లెడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.

Related posts

ప్రభుత్వ కార్యాలయాలకు నిర్మించడానికి స్థల సేకరణ

Bhavani

కోవాక్సిన్ కు వ్యతిరేక ఆర్టికల్స్ తొలగించాలని ది వైర్ కు ఆదేశం

Satyam NEWS

కరోనా నుంచి నా కుటుంబాన్ని కాపాడుకునేది ఎలా?

Satyam NEWS

Leave a Comment