38.2 C
Hyderabad
April 27, 2024 17: 46 PM
Slider పశ్చిమగోదావరి

ఆకతాయిగా తిరుగుతున్న కాలేజీ విద్యార్థులకు కౌన్సిలింగ్

#elurupolice

కాలేజీ సమయంలో క్లాసులకు వెళ్లకుండా ఆకతాయిగా తిరుగుతున్న విద్యార్థులను ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల, స్థానిక జన్మభూమి పార్క్ పరిసర ప్రాంతాలలో గుర్తించి వారిని, వారి తల్లిదండ్రులు మరియు సంరక్షకులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు చదువుకునే వయసులో క్రమశిక్షణతో మెలగాలని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెడు నడత వలన భవిష్యత్తు నాశనం అవుతుందని ఒకవేళ  క్రిమినల్ కేసులు నమోదు అయినట్లయితే ఏ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగానికి నోచుకోరని హెచ్చరించడం జరిగింది. పిల్లల ప్రవర్తన పై కదలికలపై సరైన నిఘావుంచి వారిని ఎప్పటికప్పుడు మందలించి సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సలహా ఇచ్చారు.

Related posts

పేద ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి

Satyam NEWS

కరోనా కష్టాల నుంచి ఆదుకోవాలని కమ్యూనిస్టుల ధర్నా

Satyam NEWS

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న #GoodMorningCMSir

Satyam NEWS

Leave a Comment