39.2 C
Hyderabad
April 28, 2024 12: 03 PM
Slider ముఖ్యంశాలు

పోలీస్ డైరీ: లాక్ డౌన్ వేళ పోలీసులే పండుగ పెద్దలు

#Police Dairy

జీవితాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పడం కష్టం. సొంత కొడుకులు, కూతుళ్లు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల కొందరు రోడ్లపైకి వస్తే, మరికొందరు నయం కాని రోగాలు, అవిటితనం, శరీరంలో శక్తి తగ్గి పోయి బతికేందుకు రోడ్లపైకి వస్తారు.

ఇంకొందరు బతకడానికి చేసుకునే పని లేక, పని దొరక్క ఈ కరోనా వైరస్ కష్టకాలంలో రోడ్లపైకి వచ్చి ఇతరుల సహాయం అర్థిస్తున్నారు. రోడ్లపైకి రావడం అనే కంటే రోడ్ల పక్కన విసిరి వేయబడ్డ జీవితాలు అనడం కరెక్టేమో!!!. రంజాన్ పండగ గడియలు సమీపిస్తుండగా డబ్బులు ఉన్నవారు రోడ్లపైకి వచ్చి పండగను జరుపుకొనేందుకు, తమ కుటుంబాలలో సంతోషాలు నింపేందుకు, తమకు కావాల్సిన పాలు, పండ్లు, కిరాణం వస్తువులు, సేమ్యా, నన్వేజ్, కూరగాయలు కొని ఉత్సాహంగా ఇంటికి వెళ్తుతున్నారు.

అర్థించే చేతులు ఎన్నెన్నో…

మరి కొందరు రోడ్డు పక్కన మాసిన బట్టలతో, శరీరంలో సత్తువ లేని స్థితిలో, అంగవైకల్యంతో, అనారోగ్యంతో రోడ్లపై లేచే దుమ్ము, ధూళి, ఎర్రని ఎండను, వేడిని లెక్కచేయకుండా తమ ఆకలి తీర్చే వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నారు. జీవితాలలో ఎంత తేడా? డబ్బు ఉండి జాలి, దయ ఉన్న వారు ఎవరైనా మానవతా దృక్పథంతో ఇచ్చే డబ్బులు తీసుకుని ఈ అభాగ్యులు కడుపు నింపుకుంటున్నారు.

రోడ్డుపైన వచ్చి పోయే వారిని ఆశగా చూడటం, ఇచ్చింది తీసుకోవడం, దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకోవడం తప్ప వారు ఏం చేయగలరు??? చివరి ఇఫ్తార్ సమయము సమీపిస్తుండంతో రోడ్ల పై వెళుతున్న వారిలో హడావిడి మొదలైంది.

జీవన పోరాటంలో అలసిన జీవులు

పశ్చిమ దిక్కు ఆకాశంలో మబ్బుల తెరలను దాటుతూ వస్తున్న చంద్రవంక ను చూసి అక్కడ ఉన్న ముస్లిం సోదర, సోదరీమణుల లో సంతోషం, ఉత్సాహం నిండాయి. వారి సంతోషానికి కారణం, తెల్లారితే రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్). 30 రోజుల ఉపవాసం (రోజా) ఉండి, పండుగ రోజు తో ముగింపు పలికే రోజు.

ఏ రోజు కారోజు ఇతరులను సహాయం అర్ధించి బతికే జీవులు, ఈ పండుగ ఎలా జరుపుకుంటారు?  వీరి దీనస్థితిని గుర్తించి, నేను మా కామాటి పుర పోలీస్ వారి సహకారాలతో, వీరు రంజాన్ పండుగను జరుపుకునేందుకు వారికి కావాల్సిన బియ్యం, కూరగాయలు, ఇతర వస్తువులు అందించాం.

అభాగ్యుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది

42 డిగ్రీల వేడిని, వేడి గాలులని వీస్తూ పశ్చిమ దిక్కుకి కుంగిపోయిన సూర్యుణ్ణి, ఎర్రని ఎండను లెక్క చేయకుండా రోడ్డు పక్కగా కూర్చున్న వారిలో ఒక స్త్రీ, వయస్సు మళ్ళిన తన ముసలి తల్లితో, ఇద్దరు తన చిన్న పిల్లలతో కలిసి మాకు కృతజ్ఞతలు చెప్పారు. ఒక వృద్ధుడు మాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. మరొక దివ్యాంగుడు మాకు చేతులు ఎత్తి దణ్ణం పెట్టి మా పనిని మెచ్చుకున్నాడు.

మరొక స్త్రీ,”దునియమే ఇన్సాన్ జినేకెలియే ఎత్న నౌకరీ కర్హహే, ఔర్ మిస్కిన్ లోగొంకి కిద్మత్ కర్రహహే”.(సమాజంలో మనుషులు రక్షణ కోసం ఇంతగా ఉద్యోగాలు చేస్తున్నారు. అంతే కాకుండా పేదవారికి  సేవ చేస్తూ, సహాయ పడుతున్నారు).

అల్లా కి దువా మిలేగా

అంతేకాకుండా ఆమె, ఉర్దూలో “ఆప్ పోలీస్ లోగొంకు అల్లా కి దువా మిలేగా” అని నవ్వుతూ చెప్పింది. విధి నిర్వహణలో ఇంతకన్నా అవార్డు ఇంకెక్కడ ఉంటుంది? ముస్లిం సోదర సోదరీమణులకు పోలీస్ వారి తరఫున  రంజాన్ పండగ శుభాకాంక్షలు.

కేశవ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కామాటిపుర పోలీస్ స్టేషన్, హైదరాబాద్.

Related posts

20 నుంచి విజయనగరం పీటీసీ లో అగ్నివీర్ ర్యాలీ

Satyam NEWS

మరో సారి అట్టుడికిన విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణం…!

Satyam NEWS

2023 కొల్లాపూర్ బరిలో నిలిచేది వీరే..?

Satyam NEWS

Leave a Comment