29.7 C
Hyderabad
April 29, 2024 10: 40 AM
Slider ప్రత్యేకం

2023 కొల్లాపూర్ బరిలో నిలిచేది వీరే..?

#kollapur

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం రాజకీయాలు రసవతరంగా ఉంటాయి. రాష్ట్ర రాజకీయాలు ఓ విధంగా ఉంటే కొల్లాపూర్ రాజకీయాలు మరో విధంగా ఉన్నాయి. అక్కడ పార్టీల కన్నా నాయకులకే ప్రజలు ప్రాముఖ్యత ఇస్తారు. అయితే ఇక్కడ కొల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్  కంచుకోటగా ఉంది. ఎక్కువగా కాంగ్రెస్ జెండా ఎగరేసింది..ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ నుండి రెండు పర్యాయాలు గెలిచారు. మొత్తానికి కాంగ్రెస్ అంటే కొల్లాపూర్ అనే మాట ఉంది

బీఆర్ఎస్ నుండి నిలిచేది  ఎవరు?

2018, ఎన్నికలో కాంగ్రెస్ కంచు కొట్ట నుండి కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా  బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు.ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్లారు.ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అధిష్టానం ఇప్పటికే ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించి ప్రాముఖ్యత ఇస్తుంది.జరుగుతున్న పరిణామాల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసేది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కానీ మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయని మాటలు వినిపిస్తున్నాయి.హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ కు సరైన నాయకుడని అనుచరులు అంటున్నారు. జూపల్లి కృష్ణారావు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సంగతి తెలిసిందే.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావు వస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. అదే తరహాలో ఆయన పార్టీ కూడా వీడుతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. మరి ఆ పార్టీ నుండి నిలిచేది ఎవరనీ ప్రశ్నార్థకంగానే ఉంది.ఎమ్మెల్యే ను  ఆణిముత్యంగా వర్ణించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు..టికెట్ ఎవరికీ?

అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు నేతలు బరిలో ఉన్నారు ప్రస్తుతానికి. మరి టికెట్ ఎవరికి వస్తుందని తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికే అధిష్టానం ప్రకటించినట్లు చెబుతున్నారు. గత ఏళ్ల తరబడి రాజకీయం చేస్తూ అన్ని పార్టీల నాయకులతో ఎలాంటి శత్రుత్వం లేకుండా, విమర్శలు లేకుండా రాజకీయం చేస్తున్నారు టిపిసిసి సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు. ఈయనకే టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు కొందరు సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు అంటున్నారు. ఇప్పటికే పాదయాత్ర చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.జనవరి 26 నుండి సోమశిల పుణ్యక్షేత్రం నుండి ప్రారంభం కానుంది.

మరో వైపు రంగినేని అభిలాష్ రావు కూడా పార్టీ టికెట్ నాకే వస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని కూడా పార్టీ నేతలకు, అనుచరులకు చెబుతూ వస్తున్నారు. పార్టీ గెలుపే ముఖ్యమని ఆయన అంటున్నారు. అలా చెబుతూనే ఆయన అనుచర వర్గాన్ని బలోపేతం చేస్తూ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ప్రజల్లో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.మరికొందరు బహుజన నాయకులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి ఎవరికి టికెట్ వస్తుందని తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా చింతలపల్లి జగదీశ్వర్ రావు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.ఆయన ఆధ్వర్యంలో జరిగిన మన ఊరు- మన పోరు సభ విజయవంతం కావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్ గా మారిన సంగతి తెలిసిందే.

భారతీయ జనతా పార్టీ నుండి వారే

భారతీయ జనతా పార్టీ కూడా నియోజకవర్గంలో బలోపేతం అవుతుంది. ఆ పార్టీకి 2014 వరకు జరిగిన ఎన్నికలలో వచ్చిన ఓటు బ్యాంక్  ఆరు నుంచి ఏనిమిధి వేలు మాత్రమే.హైవే సుధాకర్ రావు  2018 ఎన్నికల్లో ఏకంగా 13 వేల ఓట్లను తీసుకురావడం జరిగింది.  ఆయన నియోజకవర్గంలో సుదీర్ఘంగా 36 రోజుల పాదయాత్ర చేసి నియోజకవర్గంలో ప్రజల నుండి సానుభూతిని పొందుతున్నారు. అంతేకాదు, ప్రతిరోజు ఒక ముఖ్య నేతను పిలిపించి సభ నిర్వహించారు. చివరి ముగింపు సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చి సుధాకర్ రావును అభినందించారు. ఆయనను ఆశీర్వదించాలి అని కూడా ప్రజలను బండి సంజయ్  కోరారు.

అంతేకాకుండా కొల్లాపూర్ కు జాతీయ రహదారి, సోమశిల సిద్దేశ్వర తీగల వంతెన తీసుకురావడానికి సుధాకర్ రావు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. అయితే ఈ సభ జరగక ముందు నుండి  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భారతీయ జనతా పార్టీలోకి వెళుతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సమయంలో టికెట్ ఎవరికి వస్తుంది అనేది సందిగ్ధంలో ఉంది. ఇప్పటికైతే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళుతున్నట్లు అధికారికంగా చెప్పిన కాలం లేదు.

కానీ ఊహగానేలే వినిపిస్తున్నాట్లు ఉన్నాయి. మరి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్న సుధాకర్ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు కలిగిన జూపల్లి కృష్ణారావు కే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఆ పార్టీలోకి జూపల్లి వెళ్ళేది లేనిది కొన్ని రోజుల్లో తెలిసి పోతుంది. ఏ పార్టీ అయినా  టికెట్లు ఇచ్చినా, ఇవ్వకున్నా నాయకులు బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

బలమైన నాయకుడి కోసం బీఎస్పీ

మరోవైపు బహుజన సమాజ్ పార్టీ కూడా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి బరిలో నిలిచేందుకు ప్రజాబలం గలిగిన నాయకుని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. అన్ని పార్టీల నాయకులకు తగ్గట్టే అభ్యర్థి కూడా ఉంటారని వారు చెప్పుకొస్తున్నారు. మరి ఏది ఏమైనా  ఎన్నికలు వస్తే కానీ తెలియదు. ఏ పార్టీకి ఏ అభ్యర్థి ఉంటాడు అనేది తెలుస్తుంది. మొత్తానికి సాధారణ ఎన్నికలకు ఇంకా పది నెలలు ఉంది. ముందస్తు ఎన్నికలు పక్క వస్తాయని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో అయా పార్టీలకు  బాధ్యత వహిస్తున్న నాయకులు ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు. గెలిచే నాయకుని మాత్రమే బరిలో ఉంచాలని అనుకుంటున్నారు.

Related posts

ఎంత ప్రయత్నించినా పలుకని విక్రమ్

Satyam NEWS

తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఎందుకింత కక్ష?

Satyam NEWS

అక్టోబర్ 2న అయోధ్యలో “ఆదిపురుష్” టీజర్ విడుదల వేడుక

Satyam NEWS

Leave a Comment