28.7 C
Hyderabad
April 26, 2024 08: 14 AM
Slider మహబూబ్ నగర్

మద్యం మత్తులో పోలీసు అధికారి తప్పుడు పని

#Police

మద్యం మత్తులో తన ఇంటికి కాకుండా మరో ఇంటికి తలుపులు కొట్టిన ఓ పోలీస్ అధికారిని స్థానికులు ప‌ట్టుకుని చిత‌క‌బాదారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జడ్చర్లలో జరిగినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల సర్కిల్ పరిధిలోని రాజాపూర్ మండల ఎస్‌ఐ మగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్ళినట్లు సమాచారం. మద్యం సేవించి బుధవారం తెల్లవారుజామున తాను నివాసం ఉంటున్న జడ్చర్ల హౌసింగ్ బోర్డ్ కాలనీలో కారు డ్రైవర్ దించి వెళ్లినట్లు తెలిసింది. సివిల్ డ్రెస్ లో ఉన్న ఆ ఎస్ఐ తాగిన మైకంలో తన ఇంటికి కాకుండా కొంత దూరంలో ఉన్న మరో ఇంటికి వెళ్లి తలుపులు బాదాడు. ఆ తర్వాత గోడ దూకే ప్రయత్నం చేయడంతో స్థానికులు దొంగగా భావించి చెట్టుకు కట్టేసి చితకబాదారు. నిజం చెప్పకుండా పొంతన లేని సమాధానం ఇవ్వడంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts

సెలవులు ఇవ్వకూడదనే నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలి

Satyam NEWS

సిటిజన్ చార్టర్: అవినీతికి పాల్పడితే ఇక ఇంటికే

Satyam NEWS

కళలకు కాణాచి విజయనగరంలో అడుగు ముందుకు

Satyam NEWS

Leave a Comment