38.2 C
Hyderabad
April 29, 2024 20: 51 PM
Slider ఖమ్మం

సమాజ రక్షణలో పోలీస్ సేవలు మరువలేనివి

#puvvadaajay

శాంతి భద్రతల పరిరక్షణ, సమాజ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీస్ సేవలు మరువలేనివి, సమాజ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ అమరులైన పోలీస్ సిబ్బందికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోహార్లు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం పోలీస్ అమరవీరుల దినోత్సవంగా సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు గల అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరులకు ఘన నివాళులు అర్పించారు. పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించి కొందరు పోలీస్ అమరవీరులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ, సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్న పోలీస్ లే అని అన్నారు. పోలీస్ వృత్తి అనేక వత్తిడిలతో కూడుకున్నదని, పోలీస్ లు తమ వృత్తి ధర్మం కోసం, కుటుంబాల ను కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారని కొనియాడారు.

పోలీస్ లు కొందరు కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, అలాంటి వారి త్యాగాలు గొప్పవని, వారి కుటుంబాలను సరైన రీతిలో ఆదరించడం, గౌరవించుకోవడం మన విధి అని అన్నారు. నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని, విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు నివాళులు అర్పించడం కనీస బాధ్యత అని అన్నారు.

శాంతి భద్రతల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి చనిపోయిన అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణ కోసం నిబద్ధతతో, ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలను మరచిపోలేమని.. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అనంతరం పోలీస్ అమరుల కుటుంబాలను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామి ఇచ్చారు. కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ, zp చైర్మన్ లింగాల కమాల్ రాజ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు DCP శబరిష్ , బోస్ ACP లు, CI లు సిబ్బంది ఉన్నారు.

Related posts

భారతీయ టిఫిన్ ను తక్కువ అంచనా వేయద్దు ఆనంద్ మహీంద్రా

Sub Editor

కారు ప్రమాదంలో గాయపడిన సినీనటుడు డా.రాజశేఖర్

Satyam NEWS

కెసిఆర్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా ఉపద్రవం

Satyam NEWS

Leave a Comment