28.7 C
Hyderabad
April 28, 2024 08: 20 AM
Slider నిజామాబాద్

డోంగ్లి మండల కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమం

#poshanabhiyan

కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలో సోమవారం రోజు గ్రామపంచాయతీ ఆవరణలో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలింతలకు మరియు కిషోర బాలికలకు పౌష్టిక ఆహారం పట్ల మరియు చిరుధాన్యాలు పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మరియు బాలింతలకు శ్రీమంతం పిల్లలకు అన్నప్రాసనం చేయించడం జరిగింది. సిడిపిఓ సునంద మేడం మాట్లాడుతూ పిల్లలకు కానీ బాలింతలు కానీ పౌష్టిక ఆహారం సమయానికి తీసుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరియు అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారాలను బాలింతలు ఉపయోగించుకోవాలని ఆరోగ్యం మీ చేతిలో ఉంటది, కావున సమయానికి తగినంత చిరుధాన్యాలు పోస్ట్కాహారం తీసుకోవాలని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డోంగ్లి మండల ఎంఆర్ఓ క్రాంతి కుమార్, సిడిపిఓ సునంద, సూపర్వైజర్ వినోద, డోంగ్లి సర్పంచ్ శశాంక్ మాధవి, ఏఎన్ఎం శోభ, లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అశ్విన్, మండల ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, బాలింతలు మరియు కిశోర బాలికలు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

తుడుందెబ్బ నర్సింగరావు కుటుంబానికి జాగృతి అండ

Satyam NEWS

శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంపై విచారణ షురూ

Satyam NEWS

పెద్ద‌శేష వాహ‌నంపై ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో శ్రీ మ‌ల‌యప్ప‌స్వామి

Satyam NEWS

Leave a Comment