33.7 C
Hyderabad
April 29, 2024 00: 54 AM
Slider వరంగల్

అంగన్‌వాడీలకు పోషన్ అభియాన్ శిక్షణ

#PoshanAbhiyan

పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ములుగు జిల్లా జంగాలపల్లి అంగన్వాడీ కేంద్రం1 లోని లబ్దిదారులకు ఈ కార్యక్రమం విశిష్టత ను తెలియచేశారు.

అందులో భాగంగా వారికి సమతుల ఆహారం ప్రయోజనాలు, వ్యక్తిగత పరిశుభ్రత రక్తహీనత పై అవగాహన కల్పించారు. అందరితో పోషన్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీడీపీఓ లక్ష్మీ హాజరయ్యారు.

దీనిలో భాగంగా సీడీపీఓ  లబ్దిదారులకు పౌష్టికాహారం ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరు ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటుచేసుకోవాలని కోరారు. మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.

అలాగే అంగన్వాడి కేంద్రంలో ప్రతి నెల పిల్లల బరువు, ఎత్తు చూసి వారి పోషణ స్థితిని తెలియచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ అంజమ్మ, పోషన్ అభియాన్ సిబ్బంది వెంకట్రాజ్ ,అంగన్వాడీ టీచర్లు కవిత,పద్మ, వసంత, సుశీల, రజిత పాల్గొన్నారు.

Related posts

వలస కార్మికుల్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Satyam NEWS

టీడీపీ లో నవలా రచయితలు తయారయ్యారు

Satyam NEWS

తిరుమల తిరుపతి పాలకమండలి పై తాజా నిర్ణయం

Satyam NEWS

Leave a Comment