28.7 C
Hyderabad
April 26, 2024 07: 48 AM
Slider ముఖ్యంశాలు

‘వితంతు పింఛన్ల’ పేరు మార్చాలని పోస్టుకార్డు ఉద్యమం

#PostCard

‘ఒంటరి మహిళ’ ‘వితంతు పింఛన్’ పేరు మార్చాలని ఒక స్వచ్ఛంద సంస్థ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో చీకూరి లీలావతి మాట్లాడుతూ సమాజంలో ఒంటరి, వితంతు పింఛన్ల పేర్లతో పింఛన్లు తీసుకోవడం వల్ల వారిపై చులకన భావం చూపిస్తున్నారని అన్నారు.

వారి పట్ల హేళనాభావం కనిపిస్తుందని అందువల్ల ఆ పేరును తొలగించి ధైర్యాన్ని నింపే విధంగా పేరు మార్చాలని కోరారు. ‘విన్నపము ఒక పోరాటం’ 50 పైసల కార్డుపై రాసి పోస్ట్ చేస్తున్నామని అన్నారు.

తెలంగాణ శాసన సభ్యులు అందరూ ఈ సున్నితమైన విషయాన్ని శాసనసభలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ప్రజాసభ సాక్షిగా సమాజంలో వారి మనోభావాలు కాపాడే విధంగా పేరు మార్పు చేయాలని, వారిలో ఆత్మ స్థైర్యం నింపాలని కోరారు.

Related posts

బొబ్బిలి లో “ఇదేం ఖర్మ మన రాష్ఠ్రానికి” ప్రొగ్రాం

Satyam NEWS

కరోనా వైరస్ వ్యాప్తికి ఏ శిక్ష వేస్తారో తెలుసా?

Satyam NEWS

ఇంటి అద్దెపై ఇక నుంచి 18 శాతం GST

Satyam NEWS

Leave a Comment