38.2 C
Hyderabad
April 29, 2024 21: 13 PM
Slider తూర్పుగోదావరి

ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం

#arteyapuramputarekulu

తూర్పుగోదావరి జిల్లాలో విశిష్టమైన సాంప్రదాయ వంటకం పూతరేకులకు అరుదైన గౌరవం దక్కింది. కొత్తపేట ప్రాంతంలోని ఆత్రేయ పురం కు చెందిన పూతరేకులకు చిహ్నంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రధాన తపాలా కార్యాలయంలో దీన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్‌ కవర్‌ అందుబాటులో ఉండనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి దక్కిన పూతరేకులకు చిహ్నంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేయడం విశేషం. సుమారు 300ఏళ్ల క్రితం ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కుటీర పరిశ్రమగా ఏర్పడింది.  కోట్లాది రూపాయల టర్నోవర్‌ సాధిస్తూ మహిళలు పూతరేకుల కారణంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకుల తయారీపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్నాయి.

Related posts

అన్నమాచార్య కళాశాలలో పీజీ లకు తాత్కాలిక ధృవపత్రాల ప్రదానోత్సవం

Satyam NEWS

ఆర్య వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: మాశెట్టి అనంత రాములు

Satyam NEWS

గొర్రెకుంట హత్యల కేసు దోషికి ఉరిశిక్ష

Satyam NEWS

Leave a Comment