42.2 C
Hyderabad
April 26, 2024 18: 11 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో వేడుకగా ప్రణయ కలహోత్సవం

#Pranayakalahotsavam

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

 ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకీపై మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకీలపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చారు.

 దివ్యప్రబంధ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగారు పూలచెండ్లతో వేటకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు.

అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు.

ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నింద – స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి,

శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాధ్‌, పేష్కార్ జగన్మోహనాచార్యులు, పార్ పత్తేదార్ ఉమామహేశ్వరరెడ్డి, ఎవిఎస్వో గంగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

జైలుకెళ్లే జగన్ ను నమ్ముకుంటే అధికారులకు అధోగతే

Satyam NEWS

శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

Satyam NEWS

క్రిష్టియన్ మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట

Satyam NEWS

Leave a Comment